Begin typing your search above and press return to search.
పీతల సుజాత అవుట్ ఆమె ఇన్?
By: Tupaki Desk | 9 Oct 2016 9:34 AM GMTఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని చెప్పిన నాటి నుంచి కేబినెట్ లో బెర్త్ ను ఆశిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదేవిధంగా మంత్రి వర్గం విస్తరణపై ఊహాగానాలు - స్టోరీలూ పెద్ద ఎత్తున అటు టీవీల్లోనూ - ఇటు బ్లాగుల్లోనూ జోరందుకున్నాయి. అదిగో వారికి మంత్రి పదవి.. అంటే ఇదిగో వీరికి ఖాయం అంటూ పెద్ద ఎత్తున కథనాలు - విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత - పాయకరావు పేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కేబినెట్ విస్తరణలో చోటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.. ప్రస్తుతం పీతల సుజాత చూస్తున్న శాఖనే ఈమెకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా విశ్లేషణలు జోరందుకున్నాయి. మరి దీనివెనుక ఉన్న విషయాలేంటో చూద్దాం..
టీచింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న అనిత.. తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుని 2014లో పాయకరావు పేట ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొదట్లో కొన్నాళ్లు మౌనంగా ఉన్న అనిత.. వైకాపా ఎమ్మెల్యే రోజా దూకుడుగా వ్యవహరించడంతో ఆమె బాటలో అనిత కూడా నడిచారు. ముఖ్యంగా విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ ఉదంతంలో అధికార పక్షంపై వైకాపా నేతలు తీవ్రస్థాయిలో అసెంబ్లీలో పోరు సాగించారు. రోజా అయితే ఏకంగా సీఎం చంద్రబాబును కామ సీఎంగా పేర్కొంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో టీడీపీ పక్షాన గళం విప్పిన అనిత.. రోజాపై డైరెక్ట్ ఎటాక్ చేశారు. చంద్రబాబును విమర్శించే అర్హత రోజాకు లేదని ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలోనే రోజా నుంచి అనిత పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. కానీ, రోజా కు మాత్రం ఈ విషయంలో అనిత ఘాటుగానే జవాబిచ్చారని సీఎం దృష్టికి కూడా వెళ్లడం గమనార్హం. అదేవిధంగా ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల నేపథ్యంలోనూ అనిత.. వైకాపా నేతలపై పెద్ద ఎత్తున విరుచుకుపడి మీడియా లో ప్రచారం పొందారు. సభను జరగనివ్వడం లేదని - ప్రత్యేక హోదాపై చర్చకు వైకాపా అడుగడుగునా అడ్డుతగులుతోందని ఆమె విమర్శించి అందరి దృష్టినీ ఆకర్షించారు. దీంతో అనితకు సీఎం చంద్రబాబు వద్ద మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది.
ఇక, ఇదే సమయంలో గనులు - స్త్రీ శిశుసంక్షేమ మంత్రిగా ఉన్న పీతల సుజాతపై కొన్ని ఆరోపణలు ముసురుకున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ అనుకూల మీడియాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుకపై వచ్చిన కథనం సుజాతను ఇరుకున పడేసింది. దీంతో ఈ విషయంపై చంద్రబాబు రెండో రోజే ఫైరైనట్టు తెలిసింది.
ఇక గతంలో కూడా సుజాతపై పలు ఆరోపణలు వచ్చాయి. శాఖా పరంగాను - నియోజకవర్గంలోను ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సుజాతను పదవి నుంచి తప్పించి.. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతున్న అనితకు ఆ పదవిని కట్టబెట్టచ్చనే ప్రచారం సాగుతోంది. మరి ఏది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో కొన్నాళ్లు ఆగితేనే గానీ తెలీదు !
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/