Begin typing your search above and press return to search.
అవినీతి చేయద్దంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 23 Dec 2016 6:41 AM GMTఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి ఎమ్మెల్యేలు - పార్టీ నేతలకు చెడ్డపేరు తీసుకువస్తోంది. తెలుగుతమ్ముళ్ల అవినీతిని సామాన్యులు మొరపెట్టుకోవడంతో ఏకంగా బహిరంగంగానే టీడీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ నేతలు - కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని అటువంటి వారు తమ తీరును మార్చుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కొంతమంది కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసిందని, అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
అవినీతికి పాల్పడే వారిపై చర్యలుంటాయని, కార్యకర్తలు తీరు మార్చుకుని పార్టీ సంక్షేమానికి కృషిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పార్టీ సంక్షేమ పథకాల అమలు పట్ల అధిష్ఠానం వద్ద మంచి పేరు ఉందని, జనచైతన్య యాత్రల నిర్వహణ - పార్టీ సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాల్లో పాయకరావుపేట నియోజకవర్గం ప్రత్యేక స్థానంలో నిలిచిందని, అటువంటి మంచిపేరును కార్యకర్తలు చిల్లర పనులతో పాడు చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. ఇటీవల జరిగిన జనచైతన్య యాత్ర ల్లో తన దత్తత గ్రామంగా ప్రకటించిన రామయ్యపట్నం గ్రామాన్ని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత పరిశీలించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టాల్సిన పారిశుద్ధ్యం - రోడ్ల నిర్మాణంతోపాటు విద్య తదితర వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు తయారుచేయాలని, దత్తత గ్రామమైన రామయ్యపట్నాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సహకరించాలని ఆమె సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/