Begin typing your search above and press return to search.
విజయవాడలో ఏం జరగబోతోంది?
By: Tupaki Desk | 26 Dec 2015 7:41 AM GMTఎముకలు కొరికే చలి పెడుతున్న శీతాకాలంలో విజయవాడ రాజకీయం వేడెక్కుతోందా? దశాబ్దాల కిందట బెజవాడను వణికించిన రౌడీయిజం - వర్గపోరు మళ్లీ మొదలయ్యే ప్రమాదముందా? తాజా పరిస్థితులు చూస్తుంటే అలాంటి అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది అంటున్నారు స్థానికులు. కొన్నాళ్లుగా గుంభనంగా ఉంటున్న విజయవాడ రౌడీ రాజకీయాలు తాజాగా బయటపడ్డాయి. కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూపై వైకాపా నేత వంగవీటి రాధా విరుచుకుపడ్డారు. తన సహనాన్ని చేతకానితనంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని నెహ్రూను హెచ్చరించారు. తన తండ్రి విషయంలో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని... చనిపోయినవారి గురించి మాట్లాడడం సంస్కారం కాదని అన్నారు.
అంతేకాదు... నెహ్రూకు ఎవరూ భయపడేంత సీను లేదని... కనుసైగతో అంతా ఆడిస్తున్నట్లుగా ఆయన భ్రమ పడుతున్నారని, ఇంట్లో కూర్చోవడం మాని బయటకొస్తే అసలు సంగతి తేలిపోతుందని రాధా స్ట్రాంగ్ వార్నింగు ఇచ్చారు. నెహ్రూ వల్ల తన కుటుంబం ఎంతగానో నష్టపోయినా తాను వివాదాలు మరింత పెంచుకోరాదనే ఉద్దేశంతో సైలెంటుగా ఉన్నానని... దాన్ని చేతకానితనంగా నెహ్రూ అనుకుంటే కరెక్టు కాదని, అలాంటప్పుడు ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని రాధా సవాల్ విసిరారు. రంగా వర్ధంతి సందర్భంగా మాట్లాడిన రాధా ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాధా తాజా వ్యాఖ్యలతో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. అసలేం జరుగుతోంది... రెండు వర్గాల మధ్య మళ్లీ దాడులు జరిగే ప్రమాదముందా అన్న కోణంలో నిఘా పెట్టాయి. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో ఈ సమయంలో ఏమైనా జరిగితే మళ్లీ పాత బెజవాడగా మారిపోతుందని... ఆ పరిస్థితి రాకుండా చూడాలని పోలీసులు అనుకుంటున్నారు.