Begin typing your search above and press return to search.

బాబుకు షాకులే షాకులు..నిన్న‌కోట్ల‌..నేడు వంగ‌వీటి!

By:  Tupaki Desk   |   6 Feb 2019 11:14 AM GMT
బాబుకు షాకులే షాకులు..నిన్న‌కోట్ల‌..నేడు వంగ‌వీటి!
X
చెడ‌ప‌కురా చెడెవు అని ఊరికే అన‌లేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో ఉన్న బ‌ల‌మైన నేత‌ల్ని త‌న‌కున్న అధికారంతో ఏదోలా ఆక‌ర్షిస్తూ.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు తెచ్చే ద‌రిద్ర‌పు ప్లాన్ వేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక‌రిని చెడ‌గొడితే.. నువ్వు చెడిపోవ‌టం ఖాయ‌మ‌న్న‌ట్లుగా తాజా ప‌రిణామాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌గా సుప‌రిచితుడైన వంగ‌వీటి రాధా ఈ మ‌ధ్య పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ పార్టీకి గుడ్ బై చెప్ప‌టం వెనుక బాబు మార్క్ రాజ‌కీయం అంద‌రికి తెలిసిందే. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడిన రాధా.. తాను తెలుగుదేశం పార్టీలో చేరే అవ‌కాశం ఉన్న‌ట్లుగా సంకేతాలు ఇవ్వ‌టం.. ఆ వెంట‌నే ఆయ‌న వ‌ర్గం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఇలాంటి ట్విస్ట్ ను ఊహించ‌ని రాధాకు ఇప్పుడు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెలకొంది. బాబు మాట‌ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న.. తాను కోరుకున్న‌ట్లుగా టీడీపీలో చేర‌లేని ప‌రిస్థితి. రాధా తండ్రి.. ఒక‌ప్పుడు కాంగ్రెస్ స్టార్ లీడ‌ర్ గా ఒక వెలుగు వెలిగిన వంగ‌వీటి రంగాను అతి దారుణంగా హ‌త్య చేసింది టీడీపీనేన‌ని.. రంగా అభిమానులు నేటికి న‌మ్మేప‌రిస్థితి. ఈ విష‌యంపై వారికుండే అభిప్రాయాలు వారికి ఉన్నాయి.

రంగా హ‌త్య‌లో టీడీపీ హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌కు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉన్న వేళ‌.. ఆయ‌న కొడుకు తండ్రిని చంపిన పార్టీగా పేరున్న టీడీపీలోకి చేరటంపై రాధాను ఫాలో అయ్యే వారు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీలో కానీ రాధా చేరితే రంగా ఆత్మ క్షోభిస్తుంద‌ని చెప్పే వారు లేక‌పోలేదు.

ఏమైనా చేయండి టీడీపీలోకి మాత్రం చేరే ఆలోచ‌న చేయొద్ద‌న్న సందేహాలు ఆయ‌న‌కు చాలా బ‌లంగా వ‌చ్చిన‌ట్లుగా చెబుతారు. అంతేకాదు.. రంగా అభిమానుల‌మంటూ పెద్ద ఎత్తున రాధాకు టీడీపీలో చేరొద్దంటూ విన‌త‌లు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. దీంతో.. ఆలోచ‌న‌లో ప‌డ్డ రాధా ఇప్పుడు టీడీపీ చేరే అంశంపై ఆలోచ‌న మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో చేరితే స‌బ‌బుగా ఉంటుంద‌ని.. రాధా సామాజికవ‌ర్గం.. ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం ఒకటే కావ‌టంతో ప‌రిణామాలు సానుకూలంగా ఉంటాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే.. జ‌న‌సేన‌లో ఎంట్రీ మీద రంగా అభిమానులు మాంచి హుషారులో ఉంటే.. రాధా మాత్రం దీర్ఘాలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. రాధా కానీ పార్టీలోకి వ‌స్తే కాపు సామాజిక వ‌ర్గం అండ దొరుకుతుంద‌న్న భావ‌న‌లో ఉన్న చంద్ర‌బాబుకు తాజా ప‌రిణామం షాకింగ్ గా మారిన‌ట్లు చెబుతున్నారు. మొన్న‌టికి మొన్న కోట్ల పార్టీలో చేర‌తార‌న్నట్లుగా ప‌రిణామాలు చోటు చేసుకున్నా.. సీట్ల లెక్క ద‌గ్గ‌ర తేడా రావ‌టంతో కోట్ల చూపు వైఎస్సార్ కాంగ్రెస్ మీద ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. తాజాగా వంగ‌వీటి విష‌యంలోనూ బాబు ఆశ నిరాశ అయ్యేలా ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టం చూస్తే.. బాబు టైం అస్స‌లు బాగోలేన‌ట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.