Begin typing your search above and press return to search.
వంగవీటి భవితవ్యం ఏమిటి?
By: Tupaki Desk | 22 Sep 2018 1:09 PM GMTమరి కొద్ది నెలల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతోన్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోన్న సంగతి తెలిసిందే. టికెట్ ఆశించి భంగపడ్డ వారిని.... అసంతృప్తులను... జంప్ జిలానీలను... బుజ్జగించడం... లేదంటే వదిలేయడం వంటి కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు కొందరు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వకపోతే వైసీపీని వీడుతానని వంగవీటి రాధా పరోక్షంగా సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రాధాను బుజ్జగించేందుకు కొందరు వైసీపీ నేతలు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ, రాధా మాత్రం....సెంట్రల్ సీటు దక్క...మరేమీ వద్దు అన్నట్లు వ్యవహరిస్తున్నారట. అసలు వైసీపీలో కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నా..... రాధా వర్గం సరికొత్త ప్రతిపాదనలు పెడుతోందని టాక్ వస్తోంది. ఆ వర్గం తాజా ప్రతిపాదనలన్నీ...`సెంట్రల్`చుట్టూనే సెంటర్ అయి ఉన్నాయట.
మల్లాది విష్ణుకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే....ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని రాధా వర్గం ప్రతిపాదన పెడుతోందట. విజయవాడ సెంట్రల్ రాధాకు ఫిక్స్ చేసి.....విష్ణుకు విజయవాడ ఎంపీ సీటివ్వాలని దాని సారాంశం. కానీ, ఈ ప్రపోజల్ కు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదని టాక్. కాపుల ఓటు బ్యాంక్ బలంగా ఉన్న విజయవాడ ఈస్ట్ నుంచి వంగవీటిని బరిలోకి దింపితే ఫలితం ఉంటుందని అధిష్టానం భావిస్తోందట. అయితే, విజయవాడ ఈస్ట్ టికెట్ ను ఆశిస్తోన్న యలమంచిలి పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక వేళ రాధాకు సెంట్రల్ ఖాయం కాకుంటే....జనసేన లేదా టీడీపీ వైపు చూసే చాన్స్ ఉంది. అయితే, జనసేన తరఫున విజయవాడ సెంట్రల్ సీటుకు బోండా ఉమ ఆశిస్తున్నట్లు టాక్.
ఒకసారి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి బయటకు వచ్చిన రాధా...మరో సారి అటువైపు చూసే చాన్స్ ఉండకపోవచ్చు. మరి, రాధా భవితవ్యం ఏమిటన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.