Begin typing your search above and press return to search.
గన్ మెన్లు వదన్న వంగవీటి రాధా.. సంచలనం
By: Tupaki Desk | 28 Dec 2021 4:30 PM GMTతనకు గన్ మెన్లు వద్దన్న మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అని.. అందుకే గన్ మెన్లు వద్దన్నాను అంటూ వివరించారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్ చేసి అడిగారని చెప్పారు. తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని.. సీఎం జగన్ ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీకి ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారని తెలిపారు.
తనను హత్య చేసేందుకు రెక్కీ జరుగుతోందని ఆదివారం వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. దీంతో ఆయన హత్యకు ఎవరు రెక్కీ నిర్వహిస్తున్నారనే విషయంపై చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలపై తాజాగా వంగవీటి రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. తన తమ్ముడు టీడీపీలోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని.. ఎందుకంటే వంగవీటి రంగా హత్యకు కారణం టీడీపీ నేతలే అని తన అభిప్రాయపడ్డారు.
రెక్కీ నిర్వహించారన్న రాధాకు ప్రభుత్వం సరిపడా గన్ మెన్లు ఇచ్చినా కూడా వారిని వద్దని రాధా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా డిఫెన్స్ లో పడేలా వైసీపీని నెట్టారు. ఒకవేళ రాధాకు ఏమైనా జరిగితే అది వైసీపీ సర్కార్ కే ఎఫెక్ట్ పడనుంది.