Begin typing your search above and press return to search.

వాణీ మాట‌!..మోకాళ్ల యాత్ర చేయాలట‌!

By:  Tupaki Desk   |   7 Nov 2017 11:53 AM GMT
వాణీ మాట‌!..మోకాళ్ల యాత్ర చేయాలట‌!
X
రాజ‌కీయాల్లోకి సినీన‌టుల ప్ర‌వేశం ఎప్ప‌టి నుంచో కొన‌సాగుతోంది. ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాది రాష్ట్రాల్లో సినీన‌టులు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. తాము రాజ‌కీయ ఆరంగేట్రానికి రెడీ అవుతున్నామ‌నే సంకేతాలిచ్చేందుకు ఆయా న‌టులు ఎంచుకునే మార్గాలు విచిత్రంగా ఉంటాయి. కొంద‌రు తాము చేర‌బోయే పార్టీని - స‌ద‌రు నేత‌ల్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుంటారు. మ‌రికొంద‌రు దీనికి పూర్తిగా రివ‌ర్స్‌. వారు కావాల్సిన ఫ‌లితాన్ని అందుకునేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీని, దాని నాయ‌కుల‌ను టార్గెట్ చేసుకుంటారు. అలా తాము కావాల‌నుకున్న‌పార్టీకి ద‌గ్గ‌ర‌వుతారు.

ఇక విష‌య‌మేమిటంటే.. పూర్తి స్థాయి రాజకీయాల‌కు తాను సిద్ధ‌మ‌ని ప్ర‌ముఖ న‌టి వాణీ విశ్వ‌నాథ్ ప్ర‌క‌టించారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని తెలిపారు. తనకు రాజకీయాల్లో ఎన్టీఆర్‌ - చంద్రబాబే ఆదర్శమని చెప్పారు. సమ్రాట్‌ అశోక్‌ చిత్ర సమయంలోనే రాజకీయాల్లో చేరాలని ఎన్టీఆర్‌ తనకు సలహా ఇచ్చినట్లు తెలిపారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌పై వాణీ విశ్వ‌నాథ్ ఒంటికాలిపై లేచారు. ప్ర‌జ‌ల‌కు చేసిన ద్రోహానికి జ‌గ‌న్ మోకాళ్ల‌యాత్ర చేస్తే ఇంకా బాగుండేద‌ని ఎద్దేవా చేశారు. చేసిన పాపాలు కడుక్కునేందుకే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని మండిప‌డ్డారు. ఆయ‌న ఎన్ని పాద‌యాత్ర‌లు చేసినా ప్ర‌జ‌లు న‌మ్మ‌బోర‌ని తేల్చి చెప్పేశారు.

ఈ సంద‌ర్భంగా వాణీవిశ్వ‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ ఆదేశిస్తే రోజాపై పోటీకి సిద్ధమని చెప్పారు. మ‌రోవైపు.. వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్ర పోషిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. ఈ విషయమై సినిమా ద‌ర్శ‌కుడు తనను సంప్రదించిన విష‌యం నిజ‌మేన‌ని స్ప‌ష్టంచేశారు. అయితే తాను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వాణివిశ్వనాథ్‌ చెప్పారు.