Begin typing your search above and press return to search.

వెంకయ్యను కావాలనే దూరం పెట్టారా ?

By:  Tupaki Desk   |   22 Jun 2022 5:30 AM GMT
వెంకయ్యను కావాలనే దూరం పెట్టారా ?
X
రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరం పెట్టేశారా ? మీడియాలో వస్తున్న విస్తృతమైన కథనాల ప్రకారం అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యకే రాష్ట్రపతి అభ్యర్ధిత్వం దక్కుతుందని అనుకున్నారు. కానీ మోడి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. గిరిజన నేత ద్రౌపది ముర్ము ఎంపికలో ఎక్కడా ఎవరిలోను అసంతృప్తి కనబడకపోయినా వెంకయ్యను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్న వినిపిస్తోంది.

పార్టీ వర్గాలు, మీడియా కథనాల ప్రకారం సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి స్ట్రాంగ్ మద్దతుదారుడిగా ముద్రపడటమే వెంకయ్యకు పెద్ద మైనస్ అయ్యిందని సమాచారం. నిజానికి అద్వానీకి ఎంత మద్దతుదారుడో నరేంద్ర మోడీకి కూడా వెంకటయ్య అంతే మద్దతుదారుడు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ లోని గోద్రా అల్లర్ల సమయంలో మోడీని ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయ్ ఆదేశించారు.

అప్పట్లో మోడికి మద్దతుగా అద్వానీ, వెంకయ్యే నిలబడ్డారు. తర్వాత చాలా సందర్భాల్లో వెంకయ్య మద్దతు ఇస్తూనే ఉన్నారు. మోడీని జాతీయ అధ్యక్షుడి చేయటంలోను, 2014లో ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించటంలో కూడా వెంకయ్య మద్దతుగానే నిలబడ్డారు.

అందుకనే మోడి ప్రధాని కాగానే వెంకయ్యకు కీలకమైన బాధ్యతలప్పటించారు తన మంత్రివర్గంలో. అయితే తర్వాత ఏమైందో కానీ హఠాత్తుగా అద్వానీని దూరం పెట్టేశారు. తర్వాత వెంకయ్యను కేంద్రమంత్రిగా తప్పించి ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారు.

క్రియాశీల రాజకీయాల నుండి తనను తప్పించటంపై అప్పట్లోనే వెంకయ్య బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసినా మోడీ పట్టించుకోలేదు. క్రియాశీల రాజకీయాల నుండి తనను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయద్దని ఎంత విజ్ఞప్తి చేసినా మోడీ వినిపించుకోలేదని వెంకయ్య చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. సరే ఏదోలా సర్దుకుని వెళుతున్న వెంకయ్యను రాష్ట్రపతి పదవి వరిస్తుందని అందరూ ఆశించారు.

అయితే అందరు ఆశ్చర్యపరిచేట్లుగా మోడి మాత్రం ద్రౌపదిని ఎంపిక చేశారు. సోమవారం కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షుడు నడ్డా రెండు రోజుల క్రితమే వెంకయ్యతో భేటీ అయినపుడు కూడా మోడి ఎంపిక విషయం చెప్పలేదట. అందుకనే వెంకయ్యలో అసంతృప్తి పెరిగిపోతోందనే ప్రచారం మొదలైంది.