Begin typing your search above and press return to search.

మీరు మామూలోళ్లు కాదు సామి..! ‘ఓఎల్ ​ఎక్స్​ లో మోదీ ఆఫీస్’

By:  Tupaki Desk   |   18 Dec 2020 2:45 PM GMT
మీరు మామూలోళ్లు  కాదు సామి..! ‘ఓఎల్ ​ఎక్స్​ లో మోదీ ఆఫీస్’
X
ఓఎల్​ఎక్స్​ మన దగ్గర ఉన్నపాత వస్తువులు అమ్మేందుకు ఇదో మంచి వేదిక. చాలా మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మధ్యవర్తులు ఉండరు కాబట్టి కొనేవాళ్లకు కూడా తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి. అమ్ముకొనేవాళ్లకు మంచి ధర వస్తుంది. అయితే ఈ సైట్​ ఇప్పుడు తీవ్రంగా దుర్వినియోగం అవుతోంది. సైబర్​ నేరగాళ్లు ఈ సైట్​ను అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు పడుతున్నారు. ఫేక్​ ఫొటోలు పెట్టి అమ్మకానికి వస్తువులు ఉన్నాయంటూ మోసాలు చేస్తున్నారు. అయితే ఇప్పడు ఏకంగా మోదీ కార్యాలయానికే టోకరా వేశారు.

నరేంద్రమోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వారణాసిలో ఆయనకు ఓ అధికారిక నివాసం ఉంది. ఈ ఇంటిపై ఇప్పుడు ఆన్ లైన్​ దొంగలు కన్నేశారు. ఓఎల్​ఎక్స్​లో ఏకంగా ప్రధాని మోదీ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టారు కొందరు ప్రబుద్ధులు. నరేంద్ర మోదీ వారణాసి కార్యాలయాన్ని రూ .7.5 కోట్ల ధరకు అగంతకులు అమ్మకానికి పెట్టారు. దీంతో ఎవరో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్​క్రైం శాఖ రంగంలోకి దిగి ఆ పోస్టును తొలగించింది.

మోదీ కార్యాలయాన్ని వాళ్లు విల్లాగా పేర్కొన్నారు.. 4 గదులు , 4 బాత్రూమ్‌లతో 6,500 చదరపు అడుగుల ఈ భవంతి ఉందని వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ పెట్టిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఎల్​ఎక్స్​లో గతంలోనూ వారు ఇటువంటివి పోస్టు చేశారు. అయితే పోస్టులు చేసేటప్పుడు ఓఎల్​ఎక్స్​లో కూడా క్రాస్​చెక్​ చేసుకొనే విధానం బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.