Begin typing your search above and press return to search.

ఎన్‌ కౌంట‌ర్ లు కోరుకుంటున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   21 Sep 2015 6:52 AM GMT
ఎన్‌ కౌంట‌ర్ లు కోరుకుంటున్న కేసీఆర్‌
X
వ‌రంగ‌ల్ జిల్లాలో మావోయిస్టు స‌భ్యులు శృతి, విద్యాసాగ‌ర్ రెడ్డిల ఎన్‌కౌంట‌ర్ తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వానికి పంటికింద రాయిలాగా మారుతోంది. ఎన్‌ కౌంట‌ర్‌ విష‌యంలో ప్ర‌జాసంఘాలు - విప్ల‌వ సంఘాలు కేసీఆర్ తీరుపై విరుచుకుప‌డుతున్నాయి. అడ‌విలో ఉండే మావోయిస్టుల‌కు జ‌నంలో ఉండి మ‌ద్ద‌తు ఇచ్చే విప్లవ ర‌చ‌యిత‌ల సంఘం (విరసం) కేసీఆర్ తీరుపై విరుచుకప‌డింది. విర‌సం అగ్ర‌నేత వరవరరావు ఒక‌డుగు ముందుకు వేసి కేసీఆర్ మ‌నసులోని ఆలోచన అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో ఎన్‌ కౌంటర్లు జరగాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరుకుంటున్నారని వరవరరావు వ్యాఖ్యానించారు. వరంగల్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 13నే శృతి - విద్యాసాగర్‌ లను పట్టుకొని 15న ఎన్‌ కౌంటర్‌ చేశారని ఆరోపించారు. పోలీసులు వారిని చిత్రహింసలకు గురి చేసి, తీవ్రంగా గాయపర్చారని మండిపడ్డారు. మావోయిస్టుల ఎజెండాయే త‌మ ఎజెండా అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఇపుడు దానికి తూట్లు పొడుస్తూ మావోయిస్టుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయిస్తున్నార‌ని ఆరోపించారు. పెట్టుబ‌డిదారుల‌కు పెద్ద‌పీట వేస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ప్ర‌జ‌ల కోసం పోరాడే మావోయిస్టులపై ప్రేమ ఏ విధంగా ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. ఎన్‌ కౌంటర్‌ విషయంలో, ప్రజా వ్యతిరేక విధానాల్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు - కేసీఆర్‌ ల విధానాలు ఒకటేనని ఆయ‌న‌ విమర్శించారు.