Begin typing your search above and press return to search.

ఇదో వెరైటీ మూఢ‌న‌మ్మకం.. చ‌దివి తీరాల్సిందే!

By:  Tupaki Desk   |   11 Nov 2022 1:30 AM GMT
ఇదో వెరైటీ మూఢ‌న‌మ్మకం.. చ‌దివి తీరాల్సిందే!
X
మూఢ‌న‌మ్మ‌కం ఎంత‌టి ప‌నినైనా చేయిస్తుంది. నిన్న‌గాక మొన్న‌.. త‌న కొడుకు అనారోగ్యం నుంచి కోలుకునేందుకు ఉన్న కూతురిని బ‌లి ఇవ్వాల‌న్న తాంత్రికుడి మాట‌లు న‌మ్మిన ఓ త‌ల్లి.. త‌న క‌డుపున‌కు తానే చిచ్చు పెట్టుకుంది. ఉన్న కూతురిని ఓ రాత్రి నిద్ర‌లో ఉండ‌గా హ‌త్య‌చేసింది. మ‌రో ఘ‌ట‌న‌లో పొరుగింటి పిల్ల‌ను హ‌త్య చేసి.. త‌న ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఓ మ‌హిళ ప్ర‌య‌త్నించింది. ఇలా.. మూడ‌న‌మ్మ‌కాలు దారిత‌ప్పేసి.. ప్ర‌జ‌ల‌ను నివ్వెర ప‌రుస్తున్నాయి.

తాజాగా కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన ఓ ఘ‌ట‌న వెలుగు చూసింది. దీనిలో త‌మ‌కు మ‌గ పిల్ల‌లు పుట్ట‌డం లేద‌ని భావించిన దంప‌తులు.. త‌మ‌కు మ‌గ పిల్ల‌లు పుడితే..తొలి పిల్లాడిని డేరా బాబాకు దానం చేస్తామ‌ని మొక్క‌కున్నారు. అనూహ్యంగా వారికి ఒక మ‌గ‌పిల్లాడు పుట్టాడు. ఆ వెంట‌నే ఇంటికి కూడా తీసుకురాకుండా నేరుగా ఆసుప‌త్రి నుంచి డేరా బాబా ఆశ్ర‌మానికి తీసుకువెళ్లి.. దానం ఇచ్చేశారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. త‌ర్వాత వారికి పిల్ల‌లు పుట్ట‌లేదు.

హరియాణాలో జ‌రిగిన ఈ ఘటన ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డింది. బాలుడిని డేరాబాబా ఆశ్రమానికి విరాళంగా ఇచ్చిన ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. హరియాణా కైతాల్ జిల్లాలో ఉన్న‌ అంబాలా ప్రాంతానికి దంపతులు తమకు కుమారుడు పుడితే డేరా ఆశ్రమానికి దానం చేస్తామని మొక్కుకున్నారు. వారికి ఇదివరకే ఓ కుమార్తె ఉంది.

చిన్నారి అమ్మమ్మ సాధ్వి ప్రభ ముని.. డేరా బాబా ఆశ్రమంలోనే పనిచేస్తున్నారు. డేరా బాబా అనుగ్రహం ఉంటే ఇంకా మగపిల్లలు పుడతారని తమ విశ్వాసమని ఆమె తెలిపారు. అందుకే దంపతులు బాలుడిని ఆశ్రమానికి దానం చేశారని సాధ్వి ప్రభ ముని పేర్కొన్నారు.

చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ముంబయిలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డేరా బాబా ఆశ్రమానికి చేరుకుని దర్యాప్తు చేశారు. చిన్నారిని ఆశ్రమం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులను ముంబయి నుంచి కైతాల్కు పిలిపించారు పోలీసులు. ఈ ఘటన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దృష్టికి చేరగా.. వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.