Begin typing your search above and press return to search.
తారక్ పై ఎటాక్... వర్ల, బుద్దాల వెనుక ఎవరున్నారు..!
By: Tupaki Desk | 26 Nov 2021 12:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణిపై ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు ఏవో విమర్శలు చేశారని.. అనరాని మాటలు అన్నారని.. చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బోరున విలపించారు కూడా..! ఇక, ఈ క్రమంలోనే సభను బాయ్‌కాట్ చేశారు.
ఇక, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నందమూరి ఫ్యామిలీ కూడా మీడియా ముందుకు వచ్చింది. అదేసమ యంలో నందమూరి కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక వీడియో చేసి.. ఇలా చేయడం సరికాదు.. అయిపోయిందేదో.. అయిపోయింది.. అంటూ.. కామెంట్లు చేశారు.
ఇరు పార్టీలకూ జూనియర్ సర్దిచెప్పారు. ప్రజల కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు.. ఎవరికి ఎలా అర్ధమైనా.. టీడీపీకి మాత్రం.. మసాలా కలిపినట్టు అనిపించలేదు. అంటే.. వైసీపీపై జూనియర్ యుద్ధం ప్రకటించకపోవడం.. తీవ్రమైన వ్యాఖ్యలు.. ఒకరకంగా.. బూతులతో ఆయన కొడాలి నాని.. వంశీలపైనా.. విరుచుకుపడకపోవడం.. ఆపార్టీ నేతలను కలవరానికి గురించేసిందనే అనాలి.
అంటే.. అనుకున్న విధంగా పొలిటికల్ మైలేజీ జూనియర్ నుంచి రాలేదు. దీంతో టీడీపీ చోటా నాయకులు.. ప్రజల మధ్య గెలవలేని నాయకులు.. రంగంలోకి దిగారని.. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
జూనియర్‌ను టార్గెట్ చేస్తూ.. వర్ల రామయ్య, బుద్దా వెంకన్నలు సీరియస్ కామెంట్లు చేశారు. సొంత మేనత్తపై.. వైసీపీ నేతలు పరుషంగా మాట్లాడితే.. ఇలాగేనా స్పందించేదంటూ..వారు జూనియర్‌కు తలంటేశారు.
విరుచుకుపడాలంటూ.. హితవు పలికారు. అయితే.. దీనిపై జూనియర్ ఎలా రియాక్ట్ అవుతారో.. తెలియదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం రియాక్ట్ అయ్యారు. ``అయ్యా.. మీరిద్దరూ.. పెద్దాయన డైరెక్షన్‌లో పనిచేయడం మానేయండి. మా జూనియర్‌కు మీరు సుద్దులు చెప్పడం మానేయండి`` అని చురకలు అంటించారు.
అంతేకాదు.. ఎన్నడూ.. నందమూరి కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా లేని.. ఈ చోటా నేతలు..నోరు తెరిచారంటే.. తెరవెనుక అటుచంద్రబాబు అయినా.. ఉండాలి లేకపోతే.. లోకేష్ అయినా.. ఉండాలని.. జూనియర్ అభిమానులు చెబుతున్నారు. ఈ పద్ధతి మంచిది కాదని సూచిస్తున్నారు. నిజానికి జూనియర్ ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు చేసిన తప్పులపై కూడా ఆయన స్పందించి ఉంటే.. ఏమౌవుతుందని వారు నిప్పులు చెరుగుతున్నారు. అయినా..రాజకీయాలకు దూరంగా ఉంటూ..తన పనేదో తను చేసుకుంటున్న జూనియర్‌ను ఇలా మాట్లాడు.. అలా మాట్లాడు.. అని ఎగదోసి... రాజకీయ చలిమంటలు కాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అని జూనియర్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.