Begin typing your search above and press return to search.

ఏపీ ప్ర‌జ‌ల‌పై టీడీపీ ఫ్ర‌స్టేష‌న్ చూశారా..!!

By:  Tupaki Desk   |   4 Aug 2019 8:50 AM GMT
ఏపీ ప్ర‌జ‌ల‌పై టీడీపీ ఫ్ర‌స్టేష‌న్ చూశారా..!!
X
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చ‌వి చూసింది. వైసిపి 175 సీట్లలో 151 కైవసం చేసుకోగా - టిడిపి 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయింది. ఆ పార్టీ ఆవిర్భ‌వించాక ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడిపోలేదు. ఈ ఓట‌మి పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మరియు అతని నాయకులకు పెద్ద షాక్‌ గానే నిలిచింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చి రెండు నెల‌లు అవుతున్నా చాలా మంది టీడీపీ సీనియ‌ర్లు సైతం మొఖాలు ఎవ‌రికి చూపించుకోవాలో తెలియ‌క తిరుగుతున్నారు. కొంద‌రు మాత్రం ట్వీట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై ప‌స‌లేని విమ‌ర్శ‌లు చేస్తూ కాలం గ‌డిపేస్తున్నారు.

కొంద‌రు టీడీపీ నేత‌లు త‌మ‌ను ఓడించిన ఏపీ ప్ర‌జ‌ల‌పై తీవ్ర‌మైన ఫ్ర‌స్టేష‌న్ చూపిస్తున్నారు. తాజాగా టీడీపీ నాయ‌కుడు వర్ల రామయ్య జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసి సీఎం చేసిన‌ ప్రజలపై తన నిరాశను - కోపాన్ని వ్యక్తం చేశారు. వ‌ర్ల ఏపీ ప్రజలపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎ -1 నిందితుడిని ( వైఎస్ జగన్ మోహన్ రెడ్డి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఏపీ ప్ర‌జ‌ల‌కే చెందింద‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ వ‌ల్ల ఏపీ ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేం ఉండ‌ద‌ని... ఆయ‌న ఏం అభివృద్ధి చేస్తాడ‌ని కూడా వ‌ర్ల ప్ర‌శ్నించారు.

వైఎస్ జగన్ 11 కేసుల్లో నిందితుడని ఆయన గుర్తు చేశారు. ఎ -1 (వైఎస్ జగన్) - ఎ -2 (విజయ్ సాయి రెడ్డి) లకు అధికారం ఇచ్చినందుకు ఆయన ప్రజలను త‌ప్పుబ‌ట్టారు. ఇలాంటి అవినీతి నాయకులకు ప్రజలు ఎలా ఓటు వేస్తార‌ని వ‌ర్ల త‌న ఆక్రోశాన్ని బ‌య‌ట పెట్టుకున్నారు. ఎ -1 జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారని - ఎ -2 విజయ్ సాయి రెడ్డి న్యూ ఢిల్లీలో కేంద్రంతో లాబీయింగ్ చేస్తున్నారని - ఎ -3 నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో అరెస్టు చేసినట్లు వ‌ర్ల ఎద్దేవా చేశారు. వ‌ర్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాన్ని ఎవ్వ‌రూ త‌ప్ప‌ప‌ట్ట‌క‌పోయినా ప్ర‌జ‌స్వామ్యంలో ప్ర‌జ‌ల తీర్పునే శ‌కించేలా మాట్లాడ‌డం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.