Begin typing your search above and press return to search.
ఆయన మెగా బ్రోకర్ అంటున్న ఏపీ తమ్ముళ్లు
By: Tupaki Desk | 4 April 2016 5:15 AM GMTఏపీ అధికారపక్షంపై ఏపీ శాసన మండలిలో విపక్ష నేత వి. రామచంద్రయ్య చేసిన తీవ్ర విమర్శలపై.. తెలుగు తమ్ముళ్లు ఘాటుగా స్పందించారు. ఏపీ విపక్ష నేతల్ని కొంటున్న తెలుగుదేశం పార్టీ బ్రోకర్ల పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యపై వారు తీవ్రంగా మండిపడటమే కాదు.. రామచంద్రయ్యపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తమది బ్రోకర్ల పార్టీ అంటున్న రామచంద్రయ్యే.. మెగా బ్రోకర్ గా టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామచంద్రయ్యపై వ్యక్తిగత విమర్శలు చేసిన వర్ల మాటలు కూసింత ఆసక్తికరంగా ఉన్నాయి.
కడప జిల్లాలో చెక్క బల్లేసుకొని కూర్చొని జమాఖర్చులు రాసుకునే రామచంద్రయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని వర్ల వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడ్ని చేయటం ద్వారా ఆయనకు టీడీపీ పొలిటికల్ లైఫ్ ఇచ్చిందన్నారు. అలాంటి రామచంద్రయ్య కోట్లు సంపాదించి బెంజి కారులో తిరిగేలా అయ్యారంటే టీడీపీ.. చంద్రబాబు నాయుడే కారణంగా చెప్పుకొచ్చారు. సీఎం కావాలనే చిరంజీవి కలల్నికల్లలు చేసి.. 17 మంది ఎమ్మెల్యేలతో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి మంత్రి పదవి పొందిన రామచంద్రయ్యదే దివాళాకోరుతనమని ఆయన మండిపడ్డారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్ద ఒప్పందం కుదుర్చున్న దానికి ఎన్ని కోట్లు ముట్టాయో చెబుతారా? అంటూ సూటిగా ప్రశ్నించిన వర్లు.. తమను బ్రోకర్ల పార్టీ అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవటమే కాదు.. సారీ చెప్పలంటూ ఆయన అల్టిమేటం జారీ చేశారు. మరి.. వర్ల రామయ్య వార్నింగ్ కు రామచంద్రయ్య ఏమంటారో..? అన్ని బాగానే ఉన్నాయికానీ వర్ల.. రాజ్యసభ సభ్యుడ్ని చేసి... కోట్లు సంపాదించుకునేలా చేసిన చంద్రబాబు అంటూ చేసిన వ్యాఖ్యల్ని కాస్త చెక్ చేసుకుంటే మంచిదేమో. తిట్టాలన్న అతృతలో పార్టీ అధినేతనే డిఫెన్స్ లో పడేసేలా చేస్తున్నట్లు అనిపించట్లేదు..?