Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కూతురని కూడా చూడలేదు
By: Tupaki Desk | 2 March 2016 5:52 AM GMTచంద్రబాబును విమర్శిస్తే ఎంతటివారినైనా క్షమించకుండా విరుచుకుపడే టీడీపీ నేతలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మాత్రం పెద్దగా ఏమీ అనరు. చంద్రబాబును వ్యతిరేకించే పురంధేశ్వరి - దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటివారు ఏమైనా కామెంట్లు చేసినా చాలా సందర్భాల్లో టీడీపీ నేతలు కౌంటరేయకుండా ఊరుకుంటారు... వేసినా సున్నితంగా మర్యాదపూర్వకంగానే ప్రతి విమర్శలు చేస్తారు. రాజకీయ విభేదాలున్నా ఎన్టీఆర్ కుమార్తెగా పురందేశ్వరిని టీడీపీ నేతలెవరూ పెద్దగా ఏమీ అనరు. కానీ... ఈ మధ్య ఆ ధోరణి మారింది.. పురంధేశ్వరిని కూడా మిగతావారిలాగే తీవ్ర పదజాలంతో విమర్శించడానికి వెనుకాడడం లేదు.
అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడానికి, పోలవరానికి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడానికి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని పురందేశ్వరి విమర్శించిన సంగతి తెలిసిందే. ఆమె ఆ విమర్శలు చేయగానే టీడీపీ నేతలు ఆమెపై విరుచుకుపడ్డారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి - వర్ల రామయ్యలు పురందేశ్వరిపై ఒంటి కాలితో లేచారు. కొత్త బిచ్చగత్తె అవాకులు చెవాకులు పేలుతోందంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో పురందేశ్వరి కొత్త బిచ్చగత్తెలా తయారైందని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. పురందేశ్వరికి ఇంగితజ్ఞానం లేదని కూడా అనేశారు. పోలవరం అంచనా వ్యయం 30 వేల కోట్లకు పైగా ఎందుకు పెరిగిందో తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడడం చేతగాక తమపై నిందలు వేస్తారా అని బుచ్చయ్యచౌదరి ఆవేశంతో ఊగిపోయారు.
ఇక వర్ల రామయ్య అయితే గతాన్ని కూడా గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేసిన పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని సూచించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పురందేశ్వరి మొన్నటి ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కానీ తాము తలుపులు తెరవకపోవడంతో గతిలేక బీజేపీకి వెళ్లారని వర్ల రామయ్య చెప్పారు. ఇప్పుడు బీజేపీలో తన ఉనికి చాటుకునేందుకు, బీజేపీ అగ్రనేతల దృష్టిలో పడేందుకు ఆమె నోటికొచ్చింది పేలుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు. పురందేశ్వరి బీజేపీలో ఉన్న కాంగ్రెస్ కోవర్ట్ అని ఆరోపించారు. చూడబోతే చంద్రబాబును విమర్శిస్తే ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ అయినా టీడీపీ నేతలతో తిట్లు తినాల్సిందే అన్నట్లుగా ఉంది.