Begin typing your search above and press return to search.
వైసీపీలోకి వర్ల రామయ్య..?
By: Tupaki Desk | 22 Dec 2016 5:58 AM GMTచంద్రబాబు కరివేపాకు రాజకీయాలకు మరో నేత బలవుతున్నారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయినట్లు సమాచారం. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నా ప్రయోజనం లేకపోవడంతో సైకిల్ దిగిపోవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వర్ల రామయ్య వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
అవసరం ఉన్నా - లేకపోయినా వైసిపిలో ఉన్న ఎమ్మెల్యేలను చంద్రబాబు దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే వైసిపిని వీడి ,టిడీపీలోకి వచ్చిన వారు దిక్కుతోచకుండా పడిఉంటే, తాజాగా కృష్ణాజిల్లా - పామర్రు వైసిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టిడీపిలోకి వెళ్లబోతున్నారు. కల్పన పై పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసి, ఓటమి చవిచూసినా.. నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటోన్న వర్లరామయ్యను దాదాపుగా పార్టీ పక్కన బెట్టేసింది. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి - తెలుగుదేశం పార్టీలో చేరి - రెండు సార్లు పోటీ చేసి - ఓటమిని చవిచూసినా పార్టీనే నమ్ముకొని ఉన్న వర్ల రామయ్యను ఇపుడు కరివేపాకులా తీసి వేస్తున్నారు. వర్లరామయ్యను తెలుగుదేశం పార్టీ కులపరంగా అన్నిరకాలుగా వాడేసింది. ముఖ్యంగా జగన్ మీద మీడియాలో దాడి - ప్రతిదాడుల కోసం వర్లను అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాడేసింది.
ఉప్పులేటి కల్పన - వర్ల రామయ్యలు ఎస్సీల్లోనే రెండు వేర్వేరు వర్గాలకు చెందినవారు. ఇంతకాలం రామయ్యను పూర్తిగా వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు మరో వర్గానికి చెందిన కల్పనను పార్టీలోకి తీసుకొచ్చి.. రామయ్యను, ఆ వర్గాన్ని పక్కనపెడుతున్నారు. కల్పనను టీడీపీలోకి తేనుండడంపై రామయ్య చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తంచేశారు. నిన్న జరిగిన తెలుగుదేశం నాయకులు శిక్షణా శిబిరం నుంచి కూడా వాక్ అవుట్ చేసి మధ్యలోనే వచ్చేశారు. చంద్రబాబు ఆయనను సముదాయించడానికి ఇద్దరు మంత్రులను రాయబారం పంపారు.అయితే వర్లరామయ్య మాత్రం శాంతించలేదు. ఉప్పులేటి కల్పనపై దాదాపు మూడేళ్లుగా ప్రత్యక్షయుద్దం చేస్తుంటే,ఇపుడు ఆమెను టీడీపీలోకి ఎలా తీసుకుంటారు? పామర్రులో తన స్థానం ఏమిటి? అని ఆయన మథనపడుతున్నారు.
కాగా పామర్రులో వర్ల రామయ్యకు ఉన్న పట్టు... ఆయన వాగ్దాటి తెలిసిన వైసీపీ కల్పన స్థానంలో రామయ్యను పార్టీలోకి ఆహ్వానించే దిశగా యోచిస్తోంది. రామయ్య కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ఎస్సీనేత అయిన వర్ల రామయ్య వైసిపి లోకి వెళితే టీడీపీకి తీవ్ర నష్టం కలుగుతుంది. అందుకే ఆయన్ను బుజ్జగించే పనిలో పడింది. కానీ... ఆయన మాత్రం తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/