Begin typing your search above and press return to search.
వామ్మో... వర్ల రామయ్య మాములోడు కాదబ్బా!
By: Tupaki Desk | 26 Oct 2019 1:44 PM GMTటీడీపీ సీనియర్ నేత - ఇటీవలే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగానే పదవీ బాధ్యతలు చేపట్టిన వర్ల రామయ్య నిజంగానే మామూలోడు కాదన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. తన పార్టీ అధికారంలో ఉండగా దక్కిన ఆర్టీసీ చైర్మన్ గిరీని తనదైన స్టైల్లో వినియోగించుకున్న వర్ల రామయ్య... ఎట్టకేలకు శనివారం ఆ పదవికి రాజీనామా చేశారు. సదరు పదవికి రాజీనామా చేసినప్పటికీ... తనతో ఎలాగైనా రాజీనామా చేయించాలని పథకం పన్నిన జగన్ సర్కారుకు మాత్రం ఆయన చుక్కలు చూపించారనే చెప్పక తప్పదు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి... వైసీపీ గెలిచిన నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న టీడీపీ నేతలంతా కూడా వరుసగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే వర్ల రామయ్య మాత్రం ఆర్టీసీ చైర్మన్ పదవి నుంచి దిగేందుకు ససేమిరా అన్నారు. చైర్మన్ పదవికి ఉన్న అధికారాలు - చట్టబద్ధంగా దక్కిన పలు అంశాలను బయటకు తీసిన వర్ల... అసలు తాను ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసేదే లేదని తెగేసి కూడా చెప్పారు. ఈ క్రమంలో వర్లతో రాజీనామా చేయించేదెలాగంటూ జగన్ సర్కారు తల పట్టుకుంది.
ఈ క్రమంలో శనివారం ఎట్టకేలకు వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. ప్రభుత్వం మారి దాదాపుగా ఐదు నెలలు గడచిన తర్వాత వర్ల తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఐదు నెలల తర్వాత అయినా వర్ల రాజీనామా చేయడంతో జగన్ సర్కారు కాస్తంత ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి.
ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. ఈ ప్రకారం వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24 - 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజులలోగా రాజీనామా చేయాలని వర్లకు గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి - ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్ లో నోటీసు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వర్ల సరిగ్గా నెల రోజుల తర్వాత ఆ గడువు ముగిశాక వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.