Begin typing your search above and press return to search.
అంత వీజీ కాదు : ఓడించడం కష్టమంటున్న టీడీపీ సీనియర్....?
By: Tupaki Desk | 10 May 2022 10:30 AM GMTవైసీపీని ఓడించడం కష్టమా. ఏపీ రాజకీయాల్లో సీనియర్లు జూనియర్లు అంతా కూడా తమ అనుభవాన్ని సైతం బలాదూర్ అనేలా చేస్తూ బోల్డ్ స్టేట్మెంట్స్ ఈ మధ్య ఇచ్చేస్తున్నారు. పొత్తులు ఎందుకు అవసరం అన్నది చెబుతూ తమ కంటే జగన్ పొలిటికల్ గా బాగా బలవంతుడు అని చెప్పకనే చెబుతున్నారు. పోనీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో రాజకీయంగా తక్కువ అనుభవం ఉన్న వారు అనుకుంటే చంద్రబాబు కూడా ఇదే పాట పాడుతున్నారు.
ఆయన పొత్తులు వాటి అవసరాలు, చరిత్రల గురించి కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మరీ లెక్చర్స్ ఇస్తున్నారు. పొత్తు పెట్టుకోవడంలో రాజకీయ పార్టీలకు స్వేచ్చ ఉంది. అలాగని తమ పొత్తుల మీద వారు ప్రజలకు కూడా వివరణ ఇవ్వాలి కదా. ఇక్కడే వారు ఏదో చెప్పాలనుకుని మరేదో చెబుతున్నారు. టోటల్ గా గత కొంతకాలంగా చూసుకుంటే పొత్తుల మీద మాటల వల్ల జనాలకు ఒక విషయం అయితే అర్ధం అవుతోంది. విడిగా ఉంటే ఏ ఒక్క పార్టీ కూడా వైసీపీని ఓడించలేవు అని.
ఆ విధంగా విపక్షాల పార్టీల వారే తమకు తాముగా చెప్పేసుకుని వీక్ అవుతున్నారు అన్న మాట ఉంది. ఈ సంగతి ఇలా ఉంటే టీడీపీలో సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో మెంబర్ అయిన వర్ల రామయ్య లేటెస్ట్ గా ఒక చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైసీపీని ఓడించడం అంత వీజీ కాదు అనేశారు. నిజంగా ఇది టీడీపీకి షాకింగ్ స్టేట్మెంటే. అయితే వర్ల రామయ్య అలా ఎందుకు అన్నారు, దాని వెనక విషయం ఏంటి అంటే ఏపీలో వైసీపీకి 151 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి. మరికొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని ఆయన చెబుతున్నారు.
ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా నూటికి ఎనభై శాతం సీట్లు ఆ పార్టీవే. ఎంపీలు వారే ఉన్నారు. పైగా అధికారం చేతిలో ఉంది. ఇలా అంగబలం, అర్ధ బలం వైసీపీకే ఉన్నాయి. అందుకే వైసీపీని ఢీ కొట్టాలీ అంటే అంత సులువు కాదని వర్ల అంటున్నారు అన్న మాట. మరి మార్గం ఏంటి అంటే విపక్షాలు అన్ని కలసిపోవడమే అని వర్ల చెబుతున్నారు.
అంటే ఆయన కూడా పొత్తుల విషయంలోనే ఈ కామెంట్స్ చేశారు. టీడీపీ పొత్తులను జస్టిఫై చేసుకోవడానికి వర్ల ఇలా అందరూ కలసి కట్టుగా పోటీ చేస్తే తప్ప వైసీపీని దించలేమని చెప్పుకున్నారు. ఇక బీజేపీ విషయంలో కూడా ఆయన ఆసక్తి కరమైన కామెంట్స్ చేశారు. బీజేపీతో కూడా పొత్తు ఉంటుందన్నట్లుగా మాట్లాడారు.
పొత్తులు తమతో వద్దు అనడానికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అసలు బాధ్యులు కారని, కేంద్రంలోని పెద్దలు ఈ విషయం తేల్చాలని కూడా వర్ల అంటున్నారు. అంటే కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తులకు సిద్ధంగా ఉంటుందని వర్ల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పొత్తుల మాట ఎలా ఉన్నా వైసీపీతో అంత వీజీ కాదు అన్న మాట మాత్రం టిడీపీకే బూమరాంగ్ అయ్యేలా ఉందనే అంటున్నారు. చూడాలి మరి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో.