Begin typing your search above and press return to search.

వర్మ సంచలన ట్వీట్స్.. వైరల్

By:  Tupaki Desk   |   25 May 2019 9:46 AM GMT
వర్మ సంచలన ట్వీట్స్.. వైరల్
X
అడ్డుకున్న ఆయన ప్రజాతీర్పుతో అడ్డు తొలిగిపోయారు. ఇక వివాదాస్పద రాంగోపాల్ వర్మ అడ్డుఅదుపు లేకుండా చెలరేగిపోతున్నాడు. తాజాగా ఏపీలో తన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కాకుండా అడ్డుకున్న చంద్రబాబు పై ఇప్పుడు వర్మ ప్రతీకారానికి ప్లాన్ చేశారు. ట్వీట్లతో చంద్రబాబును ట్విట్టర్ వేదికగా చెడుగుడు ఆడేస్తున్నాడు. ఒక్కో ట్వీట్ తూటాల్లా పేలుతూ చంద్రబాబును, టీడీపీని ఇరుకునపెడుతున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాకుండా మొన్నటి వరకు అధికారంలో చంద్రబాబు అడ్డుకున్నారు. కనీసం విజయవాడలో ప్రెస్ మీట్ కూడా పెట్టుకోకుండా వర్మను పోలీసులతో తరిమికొట్టారు. దీన్ని మనసులో పెట్టుకున్న వర్మ ఇప్పుడు జగన్ అఖండ మెజారిటీతో గెలవడంతో బాబును వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ వరుస ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్నారు.

తాజాగా రాంగోపాల్ వర్మ పాదయాత్రలో జగన్ ముఖం నిండా చెమటలు కక్కిన ఫొటోను షేర్ చేశారు. 10 ఏళ్లుగా జగన్ లోని ఎమోషన్ ను చూపించిన ఫొటో ఇదీ.. దమ్ముంటే చంద్రబాబు ఇలా ఉన్న ఒక్క ఫొటోను షేర్ చేయండి అంటూ టీడీపీ అభిమానలకు చాలెంజ్ విసిరారు వర్మ.

ఇక చంద్రబాబు సైకిల్ ముందు దిగాలుగా ఉన్న ఫొటోను షేర్ చేసి.. మరో ట్వీట్ లో బాబును ఎద్దేవాచేశారు. నా కొడుకు చెప్పాడని.. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి కారణం పోలింగ్ బూత్ లో ఉక్కపోయడమేనని సెటైర్ వేశారు.

ఇలా వరుసగా చంద్రబాబుకు చెందిన ఏదో ఒక కార్టూన్ కానీ మార్ఫింగ్ ఫొటోను కానీ షేర్ చేస్తూ ఆయన్ను ఏకిపారేసాలా వర్మ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.