Begin typing your search above and press return to search.

ఆనందయ్య ఘనతపై వర్మ ట్వీట్ల వర్షం

By:  Tupaki Desk   |   24 May 2021 5:30 PM GMT
ఆనందయ్య ఘనతపై వర్మ ట్వీట్ల వర్షం
X
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య కరోనా మందుపై పడ్డాడు. ఇటీవల సామాజిక సమస్యలపై స్పందిస్తూ కాకరేపుతున్న వర్మ మోడీ, అమిత్ షా సహా వారి వైఫల్యాలను ఎండగడుతూ సంచలనం రేపారు. కరోనా సెకండ్ వేవ్ కు మోడీ సర్కార్ వ్యవహారశైలినే కారణమని ఆరోపించారు.

తాజాగా ఏపీలోని ఆనందయ్య ఆయుర్వేద మందుపై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. 'కరోనా అందరిని చంపేస్తే.. ఆనందయ్య మాత్రం అల్లోపతి మందులను చంపేశారు' అంటూ వర్మ ట్వీట్ చేశారు.ఇక మరో ట్వీట్ లో 'ఆనందయ్య కరోనా మందును అందరికీ ఇస్తే చాలని.. ఇక జనాలకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని వర్మ సెటైర్ వేశారు.

ఇక కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన ఫైజర్, భారత్ బయోటెక్, సీరం , అమెరికన్ డాక్టర్ ఫౌచీలను ట్యాగ్ చేసి వర్మ ఎండగట్టారు. ఆనందయ్య వనమూలికలతో తయారు చేసిన కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తుంటే మీరేమో వందల కోట్లతో వ్యాక్సిన్లు తయారు చేసి అంతే రేటుకు అమ్ముతారా? అని వర్మ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అపోలో హాస్పిటల్స్, ఏయిమ్స్, కేర్ సహా అన్ని ఆసుపత్రులను 'ఆనందయ్య ఆస్పత్రులుగా' మార్చాలని.. అన్ని మెడికల్ కాలేజీలు తమ సెలబస్ లో ఆనందయ్య రెసిపీ గురించి చెప్పాలని వర్మ డిమాండ్ చేయడం విశేషం.ఇలా వర్మ ఈరోజు వరుసగా ఆనందయ్య గొప్పతనంపై వర్ణిస్తూ.. కరోనా విషయంలో ఫెయిల్ అయిన వారిని ట్యాగ్ చేస్తూ ఎండగట్టడం విశేషం.