Begin typing your search above and press return to search.
ఉరి తీస్తానంటూ రక్తంతో లేఖ రాసింది
By: Tupaki Desk | 16 Dec 2019 4:46 AM GMTఅమానవీయంగా వ్యవహరించి దేశ వ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ దోషులకు కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. ఒకవైపు వారిని తీహార్ జైల్లో ఉరి తీసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు అలాంటి పిశాచాలకు సైతం కోర్టులు విధించిన శిక్షలు తగ్గించాలని.. ఉరి స్థానే యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి.
ఇలాంటివేళ.. అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్ సంచలనంగా మారారు.తాజాగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తన రక్తంతో ఒక లేఖ రాశారు. అత్యాచారానికి పాల్పడిన వారిని మహిళలతోనే ఉరి తీయించాలని డిమాండ్ చేశారు. ఆ నలుగురు నేరస్థులకు ఉరి తీయటానికి తనను అనుమతించలాంటూ సంచలన ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
ఒక మహిళ కూడా శిక్షించగలుగుతుందన్న విషయాన్ని అందరికి తెలిసేలా తనను నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు అనుమతించాలని ఆమె కోరుతున్నారు. తన ప్రతిపాదనను అమలు చేసతే అత్యాచారాలకు పాల్పడేవారికి గుణపాఠం అవుతుందని ఆమె చెబుతున్నారు. తన నిర్ణయానికి మహిళా ఎంపీలు.. ఇతర వర్గాలకు చెందిన వారు కూడా మద్దతు తెలపాలని ఆమె కోరుతున్నారు. నిజమే.. ఆడపిల్లను ఆటబొమ్మగా భావించే ఎంతోమంది మగపిశాచాలకు ఇలాంటి చర్య ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారుతుందనటంలో సందేహం లేదు.