Begin typing your search above and press return to search.

కోర్టులో క్రికెటర్ పెళ్లి

By:  Tupaki Desk   |   2 Feb 2016 5:04 AM GMT
కోర్టులో క్రికెటర్ పెళ్లి
X
ప్రముఖల పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది టీమిండియాలో పేసర్ గా సుపరిచితుడైన వరుణ్ ఆరోన్ వివాహం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రముఖులు తమ పెళ్లిళ్లను ధూంధాంగా.. వేడుకగా చేసుకునే తీరుకు భిన్నంగా ఆయన సింఫుల్ గా అదీ కోర్టులో పెళ్లి చేసుకోవటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వరుణ్ తన వివాహానాన్ని తన చిన్ననాటి స్నేహితురాలైన రాగిణి సింగ్ ను పెళ్లాడారు. వీరి వివాహం సోమవారం.. జంషెడ్ పూర్ లోని కోర్టులో చాలా సింఫుల్ గా జరిగింది. చట్టబద్ధంగా కోర్టులో ఏకమైన ఈ జంట.. ఫిబ్రవరి 4న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటారని చెబుతున్నారు. అంత ప్రముఖుడై ఉండి.. అంత హటాత్తుగా కోర్టులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో..?