Begin typing your search above and press return to search.
ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న వరుణ్ సింగ్ పాత లేఖ వైరల్
By: Tupaki Desk | 11 Dec 2021 9:31 AM GMTతమిళనాడులో చోటు చేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో అందరూ మరణించగా.. ఒకే ఒక్కరు మాత్రం మరణదేవతతో పోరాడుతున్నారు. ప్రస్తుతం చావు.. బతుకుల మధ్య పోరాటం చేస్తున్న గ్రూపు కెప్టెన్ వరుణ్ సింగ్ కు సంబంధించిన పాత లేఖ ఒకటి బయటకు వచ్చి.. ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆసుపత్రి బెడ్ మీద వైద్య సేవలకు అప్పుడప్పుడు స్పందిస్తున్న ఆయన.. ఈ గండం నుంచి బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి వేళ.. కొద్దికాలం క్రితం (ఈ ఏడాది సెప్టెంబరులో) తాను చదివిన హర్యానాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కు రాసిన లేఖ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చి.. వైరల్ గా మారింది.
స్కూలింగ్ వేళలో కెప్టెన్ వరుణ్ సింగ్ సైతం సాధారణ విద్యార్థే. ఆ మాటకు వస్తే స్కూల్ సమయంలో యావరేజ్ స్టూడెంట్ కు వచ్చే మార్కులు కూడా రాలేదట. అందుకు భిన్నంగా తాను ఎంచుకున్న ప్రొఫెషన్ లోరాణించే వరకు కూడా ఆయన సాదాసీదానే. సాధారణ విద్యార్థులకు ప్రేరణ కలిగించేందుకు.. తాను చదివిన స్కూల్ ప్రిన్సిపల్ కు లేఖ రాశారు. అదిప్పుడు వైలర్ గా మారింది.
యావరేజ్ విద్యార్థులను ఉద్దేశించిన ఈ లేఖ ఇప్పుడు కొత్త స్ఫూర్తిని ఇచ్చేలా మారింది. సాధారణ విద్యార్థుల జీవితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆయన చెబుతున్న మాటలు.. అలాంటి విద్యార్థులకు కొత్త ధైర్యాన్ని ఇచ్చేలా ఉండటమే కాదు.. సరికొత్త మార్గదర్శనం చేస్తున్నాయి.
ఇంతకూ ఆ లేఖలో ఆయనేం చెప్పారు? ఎందుకు చెప్పారు? అన్న విషయాల్లోకి వెళితే..
‘‘నేను చదవులో చాలా సాధారణ విద్యార్థిని. ప్లస్ టూలో (ఇంటర్) ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందాను. చదువు ఒక్కటే కాదు.. ఆటలు.. ఇతర కార్యక్రమాల్లో కూడా అంత చురుగ్గా ఉండేవాడిని కాదు. కానీ.. నాకు విమానాలు.. విమానయానం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది. నేను సాధారణ వ్యక్తిని. గొప్పగా చేయాలని ప్రయత్నించటంలో అర్థం లేదనే న్యూనతతో ఉండేవాడిని’’ అని తన గురించి చెప్పుకున్నారు.
విద్యార్థి దశ నుంచి ఆర్మీలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల్ని ఆయన ప్రస్తావిస్తూ.. ‘‘ఎప్పుడైతే ఫ్లైట్ స్కాడ్రన్ లో యంగ్ ఫ్లైట్ లెప్టినెంట్ గా సెలెక్టు అయ్యానో.. అప్పటి నుంచి నా ఆలోచన మారింది. నేను మనసు పెట్టి పని చేస్తే.. గొప్పగా పని చేయగలనని అర్థమైంది. అప్పుడే నా ప్రొపెషన్ లోనూ.. పర్సనల్ లైఫ్ లోనూ సానుకూల మార్పులు మొదలయ్యాయి. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకోలేదు’’ అని పేర్కొన్నారు.
ప్రొఫెషన్ లోకి వచ్చాక.. ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్ స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకోవటంతో పాటు.. కఠినమైన ప్రయోగాత్మక టెస్టు పైలట్ కోర్సుకు ఎంపికయ్యారు. చివరకు.. ఆయన సీనియార్టీ మార్కు దాటనప్పటికీ.. తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్ లో పోస్టింగ్ పొందారు.ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్ యాన్ ప్రోగ్రాం కోసం 12 మందిని ఎంపిక చేసిన జాబితాలో చోటు దక్కించుకున్నారు.
తర్వాత ఆరోగ్య సమస్యలతో వెనకుడుగు వేయాల్సి వచ్చింది. జీవితంలో నువ్వు సాధించే విజయాల్ని ప్లస్ టూ లో వచ్చే మార్కులు నిర్ణయిస్తాయని అనుకోవద్దు.. నిన్ను నువ్వు నమ్ము.. ఆ దిశగా పని చేయి అంటూ తన లేఖను ముగించారు.
నిజానికి ఈ లేఖ సాదాసీదాగా చదువుతారన్న విద్యార్థులకు మాత్రమే.. అందరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లల చదవు విషయంలో పెద్దల ఆలోచన ధోరణి ఎలా ఉండాలన్న దానికి నిదర్శనంగా ఈ లేఖ ఉంటుందని చెప్పాలి.