Begin typing your search above and press return to search.
ఇంటి కెళ్లి చొక్కా పట్టుకుంటా.. దేవినేని కి సీరియస్ వార్నింగ్
By: Tupaki Desk | 9 Nov 2019 4:34 AM GMTపాలనా పరమైన లోపాలు లేని వేళ.. ఏదో రకంగా అధికార పక్షాన్ని విమర్శించాలన్న ఉద్దేశం తో అదే పనిగా పనికి మాలిన ఆరోపణలు.. పసలేని విమర్శలు చేస్తోంది ఏపీ ప్రధాన ప్రతి పక్షం. విపత్తు కారణంగా చోటు చేసుకున్న ఇసుక కొరత మీద రార్దాంతం చేస్తున్న తెలుగు దేశం పార్టీ నేతలు హద్దులు దాటేస్తున్నారు. అనుకోని రీతి లో విరుచుకు పడిన సమస్య వేళ.. ప్రజల కు అండగా ఉండాల్సింది పోయి.. అదే అదును గా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలన్నట్లు వ్యవహరిస్తున్నారు.
విష ప్రచారాని కి తెర తీస్తున్న వేళ.. ఏపీ అధికార.. విపక్షాల మధ్య భారీ ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నట్లుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విపక్షం చేస్తున్న విమర్శల్ని తిప్పి కొడుతున్నారు ఏపీ అధికార పక్ష నేతలు. ఇలా తీవ్రస్థాయి లో ఆరోపణలు.. ప్రత్యారోపణలు సాగుతున్న వేళ.. ఆ హద్దుల్ని దాటేసి.. వ్యక్తిగత దూషణల వరకూ వచ్చింది కృష్ణా జిల్లా మైలవరం లోని అధికార.. విపక్ష నేతల మధ్య మాటలు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయి లో వార్నింగ్ లు ఇచ్చుకునే వరకూ వెళ్లింది.
తన తప్పు లేకున్నా.. అదే పనిగా తనను ఉద్దేశించి దారుణ మైన ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి దేవి నేని ఉమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఇంత కీ ఈయన ఎవరంటే ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగి.. మంత్రిప దవిని చేపట్టిన వసంత నాగేశ్వరరావు కుమారుడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేవినేని ఉమను ఓడించి.. ఎమ్మెల్యే గా గెలుపొందారు.
దీంతో వీరి మధ్య మాటల యుద్ధం అంత కంతకూ ముదురుతోంది. బాబు సర్కారులో చక్రం తిప్పటంతో పాటు.. తన హవాను ఒక రేంజ్లో ప్రదర్శించిన దేవినేని ఉమకు వసంత కృష్ణ ప్రసాద్ తీరు ఒక పట్టాన మింగుడు పడటం లేదు. తనకు తిరుగులేదనుకున్న నియోజకవర్గం లో బలమైన శక్తిగా ఆవిర్భవించిన వసంతను తొక్కి పట్టాలన్నది ఉమ ఆలోచన గా చెబుతారు. ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన వైనంతో దేవి నేని ఇప్పటికి జీర్ణించుకోలేని పరిస్థితి.
ఇలాంటి వేళ వసంత కృష్ణ ప్రసాద్ ఇసుక దోపిడీ కి పాల్పడుతున్నట్లుగా దేవి నేని ఉమ అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. తాను తప్పు చేస్తున్నట్లుగా చెప్పటమే కానీ ఎలాంటి ఆధారాలు చూపించని దేవినేని పై వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్ల దండకం అందుకున్నారు. బురదలో పంది.. దేవి నేని ఉమ ఒక్కటేనన్న వ్యాఖ్యతో పాటు.. మాటలు హద్దులు దాటితే.. తాను దేవి నేని ఉమ ఇంటికి వెళ్లి ఆయన చొక్కా పట్టుకొని మరీ ప్రశ్నిస్తానని మండిపడ్డారు. ఆయనో వెధవ అంటూ విరుచుకుపడ్డారు. మాజీ మంత్రిని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.