Begin typing your search above and press return to search.
కృష్ణా జిల్లాలో టీడీపీకి షాక్
By: Tupaki Desk | 10 May 2018 12:37 PM GMTమాజీ మంత్రి వసంత నాగేశ్వర్ రావు - ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ టీడీపీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్నాళ్లుగా టీడీపీలో ప్రాధాన్యం లేదని అసంతృప్తిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ను ఇటీవల చంద్రబాబు పిలిచి గుంటూరు జిల్లాలో పనిచేయాలని సూచించారు. కానీ ఆయన ఈ రోజు కైకలూరులో సాగుతున్న జగన్ పాదయాత్రలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడులు గత నాలుగేళ్లుగా పార్టీలో ప్రాధాన్యం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం టీడీపీ నాయకత్వానికి షాక్ ఇచ్చినట్లే. జిల్లాలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు ప్రకటించారు.
ఇటీవల కర్నూలు జిల్లా పాణ్యం నియోజకర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి బీజేపీని వీడి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాటసానికి ప్రధాన పదవితో ఆయన అనుచరులు - నేతలు ఆనందంగా ఉన్నారు. 2019లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని వారు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో నేతల చేరికలు కూడా ఎక్కువయ్యాయి.