Begin typing your search above and press return to search.
బాబు క్లోజ్ నేతలకు ఇద్దరు..ముగ్గురు భార్యలట!
By: Tupaki Desk | 13 Oct 2016 9:52 AM GMTకొన్ని విషయాల మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రపంచ పౌరుడి మాదిరి ప్రతి విషయం మీద స్పందించటం కొన్నిసార్లు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి విషయం అందరికి తెలిసేందే. ఎవరూ ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి. ఒకవేళ.. దాచే ప్రయత్నం చేసినా.. గూగులమ్మ లాంటివి బట్టబయలు చేసేసే పరిస్థితి. ఇలాంటప్పుడు తొందరపడి మాట్లాడే కన్నా.. ఆచితూచి మాట్లాడటం అవసరం. అయినా.. తనకేమాత్రం సంబంధం లేని విషయాల మీద మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే.
అలా మాట్లాడి బుక్ అయిపోవటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. నైతిక విలువలు.. కుటుంబం గురించి క్లాస్ పీకే క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి బాబు ప్రస్తావించారు. ‘ఇప్పుడు ఆయనకున్న ఆమె నాలుగో భార్య అనుకుంటా’ అని వ్యాఖ్యానించిన బాబు అందరికి ఒక్కసారిగా షాకిచ్చారు. అక్కడెక్కడో ఉన్న ట్రంప్ గురించి ఇక్కడున్న బాబు మాట్లాడటం తప్పని చెప్పలేం కానీ.. తన పార్టీ నేతలకు సంబంధించిన విషయాలు బాబుకు తెలీకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అన్న వ్యాఖ్య పలువురు నోట వినిపించింది.
దీనికి తగ్గట్లే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రియాక్ట్ అయ్యారు. ట్రంప్ కున్న భార్యల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. తన చుట్టూ ఉన్న నేతలకున్న భార్యల గురించి ఏం చెబుతారంటూ సూటి ప్రశ్నను సంధించటం గమనార్హం. తాజాగా ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడో ఉన్న ట్రంప్ భార్యల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ.. ఆయన తన పక్కనే ఉన్న ఇద్దరు టీడీపీ నేతలకు కూడా ఇద్దరు.. ముగ్గురు భార్యల సంగతి మర్చిపోయినట్లున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ తోపాటు.. సొంతింటిని చక్కదిద్దుకోరు కానీ.. ఊరి మీద పడతారే? అన్న విమర్శలు ఎదురవుతాయి. అందుకే.. మాట్లాడే విషయం గురించి ఒకటికిరెండుసార్లు ఆలోచించి చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందేమో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/