Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ ఓ బ్రోకర్
By: Tupaki Desk | 13 Nov 2015 6:57 AM GMTనిజంగా పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంచలనమే. కరెక్టుగా చెప్పాలంటే ఏం చేయకపోయినా సంచలనమే!! పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అది మరి. జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు మరింత హైప్ వచ్చింది. పవన్ పై స్పందించేవారి లిస్ట్ చాంతాడంత పెరిగిపోయింది. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ సమావేశం అవడం ఆయనపై స్పందించేందుకు దొరికిన మంచి అవకాశంగా పలువురు రాజకీయనాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పవన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు పవన్ పై ఓ టీవీ షోలో ఫైరయ్యారు.
పవన్ కళ్యాణ్ ను ఇన్నాళ్లు లాబీయిస్ట్ గా భావించామని..కానీ ఇపుడు ఆయనపై అభిప్రాయం మార్చుకున్నామని వివరించారు. ఆయన రాజకీయ బ్రోకర్ గా మారిపోయారని దుయ్యబట్టారు. కేంద్రంలో బీజేపీ - రాష్ర్టంలో టీడీపీ అధికారపగ్గాలు చేపట్టి 18 నెలలు గడుస్తున్నాయని...ఈ క్రమంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని చెప్పారు. వాటిపై ఏనాడు స్పందించని పవన్ బ్రోకర్ గా మారిపోయారని దుమ్మెత్తిపోశారు. పైగా పాలనలో ఉన్న చంద్రబాబుతో కలవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
వాసిరెడ్డి పద్మ గతంలో ప్రజారాజ్యం పార్టీ నాయకురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ....చిరంజీవి చీటర్ అని దుయ్యబట్టి ఆమె వైసీపీలో చేరారు.