Begin typing your search above and press return to search.
బాబును కాపాడేలా నివేదిక రాశారు:పద్మ
By: Tupaki Desk | 19 Sep 2018 2:01 PM GMTగత నాలుగేళ్ల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ లో అవినీతి, అరాచకం పెరిగిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. అధికారం చేతిలో ఉంది కదా అని చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు తెలుగు తమ్ముళ్లు నానా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నచందంగా ...టీడీపీ అధినేత చంద్రబాబు తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటున్న తరహాలోనే టీడీపీ నేతలు కూడా తమ తప్పులు కప్పి పుచ్చుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ దాహానికి 30మంది అమాయక భక్తులు బలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై జస్టిస్ సోమయాజులు ఇచ్చిన నివేదికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. సీఎం వెళ్లిన తర్వాత ఆ ప్రమాదం జరిగిందని సోమయాజులు చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును కాపాడడానికే జస్టిస్ సోమయాజులు ....ఆ నివేదిక ఇచ్చారని మండిపడ్డారు.
చంద్రబాబుకు మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువని - సోమయాజుల కమిటీ నివేదికే ఆ నైపుణ్యానికి నిదర్శనమన్నారు. మూఢనమ్మకంతో అంతమంది భక్తులు ఆ ప్రాంతానికి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీతో చెప్పించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆ నివేదికను చంద్రబాబే రాసినట్టుందని - దానిపై సోమయాజులు సంతకం పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. సీఎం ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగిందని ఎస్సీ నివేదిక కూడా ఇచ్చారని, కానీ కానీ కమిషన్ నివేదిక మరోలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలలో ఆ 30మంది మరణాలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఆ ప్రమాద ఘటనపై చంద్రబాబుకి కనీసం మానత్వం కూడా లేదని మండిపడ్డారు. చంద్రబాబు పుష్కర స్నానం డాక్యుమెంటరీ కోసం డైరెక్టర్ బోయపాటి బృందంతో ఏర్పాట్లు చేయించారని ఆరోపించారు. ఆ నివేదికలో భాష అభ్యంతరకరంగా ఉందని, ప్రజలకు ఇంగితం లేదని సోమయాజులు ఎలా అంటారని పద్మ ప్రశ్నించారు. ఆ తరహా భాష రాయడానికి చేతులెలా వచ్చాయని మండిపడ్డారు. తొక్కిసలాట ఫుటేజ్ తొక్కేశారని, సోమయాజులు అనే వ్యక్తికి గోదావరి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గోదావరి ఆయనను క్షమించదని, ఈ నివేదికను తమపార్టీ వ్యతిరేకిస్తుందని.. ఈ ఘటనపై తమ పోరాటం కోనసాగుతుందని పద్మ ధ్వజమెత్తారు.