Begin typing your search above and press return to search.
ఏబీఎన్ సర్వేను ఎవరూ నమ్మట్లే..
By: Tupaki Desk | 28 Nov 2016 9:30 AM GMT ఏబీఎన్ ఛానల్ - ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన తాజా సర్వే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది. అయితే... సర్వే చేయించిన ఏబీఎన్ యాజమాన్యానికి టీడీపీతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆ సర్వే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు చంకలు గుద్దుకోవడం తప్ప ఇతర పార్టీలేవీ ఆ లెక్కలను నమ్మడం లేదు. మరోవైపు సర్వే ఫలితాల నేపథ్యంలో విపక్ష నేత జగన్ తనకు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఈ ఉదయం చర్చలు జరిపారు. విజయసాయి రెడ్డి సహా పలువురు జగన్ ఇంటికి వెళ్లి కలిసి చర్చించారు. దీనిపై పార్టీ పరంగా ఎలా స్పందించాలి... అసలు సర్వేలో వాస్తవాలు ఎంత? నిజంగా ఆ పరిస్థితి ఉందా.. ఉంటే ఏం చేయాలి.. వంటి అన్ని అంశాలపై చర్చించారు.
కాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేను వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ తేలిగ్గా తీసుకున్నారు. ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ టీడీపీలోకి ఫిరాయింపులు జరిగేందుకు మధ్యవర్తిగా వ్యవహరించారని... అలాంటి వ్యక్తి జరిపించిన సర్వే ఇలాగే ఉంటుందని ఆమె ఆరోపించారు. చంద్రబాబును గండాల నుంచి చంద్రబాబును గట్టెక్కించేందుకే ఈ సర్వే నిర్వహించారని విమర్శించారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగే పరిస్థితి లేకపోవడం - ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అంతా బాగుందని నమ్మించేందుకు ఈ సర్వే ఎత్తుగడ వేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉంటుందా పోతుందా అని పార్టీ నేతలు ఆందోళన చెందుతుండడంతో వారిలో ధైర్యం నింపేందుకు చంద్రబాబు, సదరు ఛానల్ ద్వారా ఈ పని చేయించారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మరోవైపు వైసీపీ నేత గోనె ప్రకాశరావు కూడా ఏబీఎన్ సర్వేను నమ్మాల్సిన పనిలేదని తేల్చేశారు. చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో సర్వే చేసిన ఆంధ్రజ్యోతి ప్రజారాజ్యం అధికారంలోకి వస్తోందని చెప్పిందన్నారు. చిరంజీవితో విభేదాలు రాగానే ప్రజారాజ్యం పార్టీ అట్టర్ ప్లాప్ అవుతోందని కూడా రాసిందని గుర్తు చేశారు. ఈ సర్వే కూడా వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కు నాలుగు శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయని ఆంధ్రజ్యోతి చెప్పడంపై జనసేన నాయకుడు కల్యాణ్ దిలీప్ తీవ్రంగా స్పందించారు. ఏబీఎన్ సంగతి అందరికీ తెలుసని... ఆ సర్వేలను ఎవరూ నమ్మరని తేల్చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/