Begin typing your search above and press return to search.
అమరావతి సెక్రటేరియట్ లో వాస్తు లోపం!
By: Tupaki Desk | 20 May 2019 10:37 AM GMTఅప్పుడెప్పుడో కట్టిన కట్టడాల్లో వాస్తు లోపం ఉందంటే.. అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అవగాహన పెరిగింది. అలాంటి వేళ నిర్మించిన కట్టడాల్లో వాస్తులోపం మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో కట్టించిన ఏపీ సెక్రటేరియట్ వాస్తుకు భిన్నంగా ఉందంటూ ప్రముఖ వాస్తు సిద్ధాంతా గోటూరి పాములు షాకింగ్ విషయాల్ని వెల్లడించారు.
అమరావతిలో నిర్మించిన సెక్రటేరియట్ లో పలు వాస్తు దోషాలు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వాస్తు వ్యతిరేకంగా కట్టటం కారణంగా వచ్చే ప్రభుత్వాలకు నష్టాలు ఏర్పడతాయని చెప్పారు. తాజాగా విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పలు అంశాల్ని వెల్లడించారు.
సెక్రటేరియట్ రూట్ ఎండ్ కి నిర్మించారని.. తప్పుడు నిర్ణయాలతో సీఎం ఆఫీసు ఎదుట అసెంబ్లీని నిర్మించారన్నారు. తూర్పు మూతపడిందని.. దీని వల్ల నష్టం జరుగుతుందన్నారు. ఒక్క ఈశాన్యం గేటు తప్పించి.. మొత్తం సెక్రటేరియట్ వాస్తు లోపంతో నిర్మించిన్నట్లుగా చెప్పారు.
ముఖ్యమంత్రిఎవరైనా సరే అమరావతి సెక్రటేరియట్ కు వెళితే డౌన్ అవుతారని.. ముక్కోణం రోడ్డు.. రోడ్డు శూల.. ఇలా చాలానే లోపాలు ఉన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ దోషాలు పోవాలంటే సెక్రటేరియట్ వాస్తును తప్పనిసరిగా మార్చాల్సి ఉంటుందన్నారు. ఇటీవలే వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన నిర్మాణాల్లోనూ వాస్తు లోపం అంటే ఏమనాలి? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? వాస్తు సిద్ధాంతి చెప్పిన వ్యాఖ్యలపై అధికార... విపక్ష నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.