Begin typing your search above and press return to search.
ఒకే ఫ్లైట్ లో సీఎం..మాజీ సీఎం..పలుకరింపులు లేవట!
By: Tupaki Desk | 23 May 2019 5:56 AM GMTరాజకీయంగా బద్ధ శత్రువులు అయినప్పటికీ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ముఖముఖాలు చూసుకోవటం.. పలుకరించుకోవటం లాంటివి చేస్తుంటారు. ఇక.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అదే సమయంలో అదే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వేళ.. అలాంటి ఇద్దరు ముఖ్యనేతలు ఒకే విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడుకోవటం మామూలే.
ఇందుకు భిన్నమైన పరిస్థితులు తాజాగా చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఒకే విమానంలో ఉన్నప్పటికీ వారిద్దరూ మాట్లాడుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు ఢిల్లీ నుంచి జైపూర్ కు ఒకే విమానంలో బయలుదేరారు. విమానం ల్యాండ్ అయ్యే వరకూ మాట్లాడుకోని వారిద్దరూ.. ఫ్లైట్ దిగిన తర్వాత ఇరువురు వేర్వేరు గేట్ల నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. రాజే బిజినెస్ క్లాస్ లో ఉన్నారని.. తాను ఎకానమీ క్లాస్ లో ప్రయాణించినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తనకు ముందున్న కేబిన్ లో వసుంధర ఉన్నారని తనకు తెలీదని.. తెలిసి ఉంటే.. తానే వెళ్లి పలుకరించే వారినని వ్యాఖ్యానించారు. మొత్తానికి ముఖ్యమంత్రి భలేగా కవర్ చేశారు కదూ?