Begin typing your search above and press return to search.
జగన్ సీఎం కాలేరు...వైసీపీలో వాసుపల్లి హీట్....?
By: Tupaki Desk | 7 May 2022 10:12 AM GMTవిశాఖ వైసీపీకి జై కొట్టిన సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొంతకాలంగా అధికార పార్టీలో పోకడల పట్ల అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం అయితే సాగుతూ వస్తోంది. దానికి సంకేతమా అన్నట్లుగా ఉమ్మడి విశాఖ వైసీపీ కొత్త రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎదుటనే అలా అయితే జగన్ సీఎం కాలేరు అంటూ కుండబద్ధలు కొట్టడం విశేషం. నేరుగా బాబాయ్ ఎదుటనే అబ్బాయ్ రాజకీయ భవిష్యత్తు గురించి వాసుపల్లి చెప్పడమే హైలెట్.
ఇదంతా ఎందుకు అంటే వైవీ సుబ్బారెడ్డి నియామకం జరిగిన తరువాత వస్ట్ టైమ్ విశాఖ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి విశాఖలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ప్రెసిడెంట్లతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వాసుపల్లి తన అసమ్మతిని బహిరంగంగానే వినిపించేశారు.
ఇంతకంటే మంచి తరుణం మించిన రాదు అని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఏకంగా జగన్ కి కుడి భుజమైన విజయసాయిరెడ్డి మీదనే హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఇక జగన్ సొంత బాబాయ్ ఎదురుగానే విశాఖలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది తేటతెల్లంగా వివరించేశారు.
గతంలో రీజనల్ కో ఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి పార్టీలో తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన లేటెస్ట్ గా వైవీ సుబ్బారెడ్డి ఎదుట అభ్యంతరం వ్యక్తం చేయడమే విశేషం. ఎమ్మెల్యేలు గెలిస్తేనే జగన్ గెలుస్తారు, మళ్లీ సీఎం కాగలరు, అంతే తప్ప రాజ్యసభ సభ్యుల వల్ల కాదంటూ వాసుపల్లి పేల్చిన బాబు విజయసాయిరెడ్డినే టార్గెట్ చేసింది.
ఆయన హయాంలో ఎమ్మెల్యేలకు విలువ పెద్దగా ఇవ్వలేదన్నది వాసుపల్లి ఆవేదనగా చెబుతున్నారు. ఇక తన సౌత్ నియోజకవర్గంలో తనకు యాంటీగా వేరే నాయకులను ప్రోత్సహిస్తూ వచ్చారని వాసుపల్లి బాధా ఆవేదనట. మీరు అలా కాకుండా పార్టీని గాడిన పెడతారు అని ఆశిస్తున్నట్లుగా వాసుపల్లి ముక్తాయింపు ఇచ్చినప్పటికీ ఆయన మీద వైసీపీలో చాలా డౌట్లే ఉన్నాయి.
ఈ మధ్యనే విశాఖ వచ్చిన చంద్రబాబు జరిపిన సభలు సూపర్ హిట్ కావడంతో పాటు, రానున్న రోజుల్లో వైసీపీ మీద యాంటీ పెరిగితే తన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుందని ముందు జాగ్రత్తగానే ఆయన తన అసమ్మతిని ఇలా తెలియచేశారు అంటున్నారు. మొత్తానికి వాసుపల్లి ఫ్యాన్ నీడన ఇమడలేకపోతున్నారు అన్నది సత్యమని అంటున్నారు. మరి ఆయన సైకిలెక్కేస్తారా. చూడాలి.