Begin typing your search above and press return to search.
టీడీపీకి మైండ్ బ్లాక్ న్యూస్ చెప్పిన గణేష్.. మరో నలుగురు రాజీనామాకి సిద్ధంగా ఉన్నారట !
By: Tupaki Desk | 23 Sep 2020 5:00 PM GMTటీడీపీ కి బై బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యే వార్త ఒకటి చెప్పారు. టీడీపీని వీడి వైసీపీ లో చేరేందుకు మరికొందరు నేతలు కూడా రెడీగా ఉన్నారని తాజాగా వాసుపల్లి గణేష్ వెల్లడించారు. తాజాగా నేడు మీడియాతో మాట్లాడిన అయన టీడీపీ నుండి వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయం పై స్పందించారు.
విశాఖపట్నంను రాజధానిగా ప్రకటించడం వల్ల ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి నోచుకుంటుందని, టీడీపీ దీన్ని అడ్డుకుంటోందని, ఈ ప్రాంతంలో పుట్టి, పెరిగిన తాము విశాఖపట్నంను రాజధానిగా చేయడాన్ని ఎలా వ్యతిరేకించగలమని అన్నారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతంగా ఉంటోందని, వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రాంతం తలరాత మారుతుందని వాసుపల్లి చెప్పారు.ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక సూచన చేయాలి.. కానీ అది జరగడం లేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా చేశారు.. ప్రతిపక్ష పార్టీగా పేదవాడి నోట్లో మట్టి కొట్టొద్దన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడూ లేని అభివృద్ధి పనులు వైసీపీ పాలనలో కొనసాగుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 90 శాతం మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీగా వైసీపీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గ పనుల కోసం బంట్రోతులా తిరిగిన టీడీపీ హయాంలో పనులు జరగలేదన్నారు గణేష్. సూటు బూటు వేసుకున్న వారికే టీడీపీ ప్రభుత్వంలో పనులు జరిగాయని, అభివృద్ధికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సూచన చేసిందని.. పేదల కోసం ఉద్యమాలు చేయమని టీడీపీ చెప్పలేదన్నారు. కోర్టులకు వెళ్లి పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్నాయన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయాను.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం.. తనపై అనర్హత ఫిర్యాదు చేసుకోమనండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వెంట నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటూ .. పార్టీకి ఏ పేదలు అండగా ఉంటూ వచ్చారో.. వారే దూరం అయ్యారని, ఫలితంగా- టీడీపీకి భవిష్యత్తు ఉండదని చెప్పారు. మరో 20, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొనసాగడం ఖాయమని అన్నారు.