Begin typing your search above and press return to search.
ఆవు మూత్రం మీదా పన్ను బాదుడేంది బాబు?
By: Tupaki Desk | 13 May 2016 5:07 AM GMTఅవకాశం ఉన్న ఏ అంశాన్ని వదలకుండా పన్ను జాబితాలోకి తీసుకొచ్చేయటం ఈ మధ్య ప్రభుత్వాలకు అలవాలుగా మారింది. ఏదైనా హోటల్ కి వెళ్లి నచ్చిన భోజనం తిన్న తర్వాత వచ్చిన బిల్లును చూస్తే.. వందలో 20 రూపాయిలు కేవలం ట్యాక్సుల రూపంలో లాగేసుకుంటున్న పరిస్థితి. నోటికి నచ్చిన తిండిని తినేందుకు కూడా ఇంతేసి పన్నులు కట్టాలా? అని ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పని పరిస్థితి. ఇదిలా ఉంటే.. రోజురోజుకీ పన్నుల జాబితాలో కొత్త కొత్త అంశాల్ని చేరుస్తూ.. అన్ని వస్తువులను పన్నుల చట్రంలోకి తీసుకురావటంపైన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న పరిస్థితి.
ఈ విషయంలో ఏపీ సర్కారు మరీ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. విభజన కారణంగా నెలకొన్న ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు వీలున్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకునేందుకు బాబు సర్కారు సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తుంది. ఈ కారణంగానే పెట్రోల్.. డీజిల్ మీద ప్రత్యేక పన్ను బాదుడు బాదిన ఏపీ సర్కారు.. ప్రజల నుంచి వచ్చిన విమర్శల్ని లైట్ తీసుకున్నదే తప్పించి.. పన్ను పోటు నుంచి రిలీఫ్ ఇవ్వకపోవటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఒక వస్తు వినియోగం మీద పన్ను విధిస్తూ తీసుకున్న నిర్ణయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆవు మూత్రానికి అయుర్వేదం.. మరికొన్ని అంశాల్లో ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. గోమూత్రాన్ని పూజలకు.. ఔషధంగా పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఇంత భారీగా వినియోగిస్తున్న గోమాత్రం మీద పన్ను వేస్తే నాలుగు రూపాయిలు వస్తాయన్నట్లుగా ఏపీ సర్కారు పన్ను మోత మోగిస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940 కింద లైసెన్స్ పొంది అయుర్వేద.. హోమియోపతి మందుల్ని తయారు చేస్తున్న వారి మీద పన్నులు విధించినట్లే.. గోమాత్రాన్ని ఔషధంగా ఉపయోగిస్తున్నందుకు కూడా పన్ను కట్టాలని చెప్పటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇలాంటి నిబంధన దేశ వ్యాప్తంగా మరే రాష్ట్రంలోనూ లేదని చెబుతున్నారు. పలు వ్యాధులకు ఔషధంగా వినియోగించే ఆవు మూత్రం మీద పన్ను పోటు లేకుండా చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. గోమూత్రాన్ని.. పేడను షాంపూలు.. సబ్బులు.. పెనాయిల్.. అగర్ బత్తీలు.. దూప్ బత్తీలు.. దోమల నివారణ కాయిల్స్ తదితర వస్తువల్ని ఉత్పత్తి చేసేందుకు వినియోగిస్తారు. ఇక మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ది చేసి అమ్ముతుంటారు. తాజాగా విధించిన పన్ను పోటు పుణ్యమాని గోమూత్రంతో తయారు చేసే వస్తు ధరలు పెరగటం ఖాయమంటున్నారు. చివరకు గో మూత్రం మీదా పన్ను విధించాల్సిందేనా బాబు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఈ విమర్శలతో అయినాబాబు మైండ్ సెట్ మారుతుందా?