Begin typing your search above and press return to search.
జంపింగ్ నేతకు పదవి కూడా ఖరారైందట!
By: Tupaki Desk | 17 Oct 2016 9:58 AM GMTమాజీ డిప్యూటీ స్పీకర్ - రాష్ట్ర అంచనాల కమిటీ మాజీ ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరికకు ముహుర్తం సిద్ధమైంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలిసి పార్టీలో చేరనున్నట్లు వేదవ్యాస్ తెలుపగా బాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 21న సాయంత్రం 4గంటలకు ఆయన విజయవాడలో టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. అయితే వేదవ్యాస్ పసుపు కండువా కప్పుకోవడానికి ముందే ఆయనకు కీలకమైన పదవిని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది.
మూడుసార్లు ఏఐసీసీ సభ్యునిగా - అంచనాల కమిటీ ఛైర్మన్ గా - ఉప సభాపతిగా అనేక పదవులు నిర్వహించిన వేదవ్యాస్ కాంగ్రెస్ ను వీడి వైకాపాలో చేరినప్పటికీ అందులో ఇమడలేకపోయారు. ముఖ్యంగా పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కోవటమే కాకుండా రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు కూడా సందేహంగా మారింది. ఈ క్రమంలో ఆయన టీడీపీలో చేరడం అనివార్యంగా మారింది. వేదవ్యాస్ తనయుడు కిషన్ తేజ్ కు - ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మధ్య ఉన్న స్నేహం కారణంగా వ్యాస్ టీడీపీ గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే సీనియర్ నేతగా ఆయనకు ఏ పదవి దక్కనుందనే చర్చ సహజంగానే సాగుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన వేదవ్యాస్ కు మచిలీపట్నం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (మడ) ఛైర్మన్ పదవిని ఇస్తారనే ప్రచారం సాగుతోంది. పెడనతో పాటు బందరు నియోజకవర్గంపై కూడా వేదవ్యాస్ కు మంచి పట్టు ఉన్న నేపథ్యంలో మడ ఛైర్మన్ పదవి ఆయనకు ఇస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి మరికొన్ని అనుకూల వాదనలు కూడా వినిపిస్తుండటం ఆసక్తికరం. 2014 సాధారణ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేసి విజయం సాధించిన కరుడుకట్టిన కాంగ్రెస్ వాది మండలి బుద్ధప్రసాద్ కు చంద్రబాబు సముచిత స్థానం కల్పించి శాసనసభ ఉప సభాపతిగా నియమించారు. అదేవిధంగా వేదవ్యాస్ కు కూడా టీడీపీలో సముచిత స్థానం కల్పించనున్నట్లు సమాచారం.
మరోవైపు వేదవ్యాస్ చేరిక పట్ల ఆయన రాజకీయ ప్రత్యర్థి, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు వర్గం మౌనంగా వ్యవహరిస్తోంది. గత 25 సంవత్సరాలుగా పెడన నియోజకవర్గంలో కాగిత వెంకట్రావు - వేదవ్యాస్ రాజకీయంగా నువ్వా.. నేనా? అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఈక్రమంలో టీడీపీలో చేరుతున్న వేదవ్యాస్ - కాగిత మధ్య సమన్వయం ఎలా ఉంటుందోనని పెడన నియోజకవర్గ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/