Begin typing your search above and press return to search.
ముంబై ఎయిర్‌పోర్టు లో వీడొక్కడే సీన్ రిపీట్ .. కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ !
By: Tupaki Desk | 30 April 2021 7:30 AM GMTడ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టడానికి పోలీసులు ఎంతగా అయితే ప్రయత్నం చేస్తున్నారో అంతకి రెండు రేట్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవారు కొత్త కొత్త మార్గాలతో డ్రగ్స్ స్మగ్లింగ్ ను కొనసాగిస్తున్నారు. ఎవరికీ అనుమానం విగ్రహాల్లో డ్రగ్స్ కలిపి స్మగ్లింగ్ చేస్తున్నారు. తినే ఆహార పదారాల్లో దూర్చి దేశం దాటిచేస్తున్నారు. మరికొందరు మత్స్యకారుల బోటు మాటున తరలిస్తున్నారు. ఇక డ్రగ్స్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో సూర్య నటించిన వీడొక్కడే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. డ్రగ్స్ క్యాప్సుల్స్ ను మింగి, వాటిని కడుపులో దాచుకొని మలేషియాకు తరలించే సీన్, ఆ మూవీకే హైలైట్. తాజాగా అచ్చం అలాంటి ఘటనే ముంబై ఎయిర్ పోర్టులో జరిగింది. కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ దాచుకొని ఇండియాకు తరలించిన ఇద్దరు ఆఫ్రికన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు.
ఈ నెల 22న ఇద్దరు టాంజానియా దేశస్థులు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎప్పటిలాగే ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు చేశారు. వారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. అంతేకాదు చాలా నీరసించి పోయినట్లు కనిపించడంతో అనమానం ఎక్కువ అవ్వడంతో అక్కడే ఉన్న స్కానింగ్ సెంటర్ కు తీసుకెళ్లి పరీక్షించారు. వారి పొట్టలో పెద్ద మొత్తంలో క్యాప్సుల్స్ కనిపించాయి. ఆ తర్వాత క్యాప్సుల్స్ బయటకు తీసి చెక్ చేస్తే, అందులో కొకైన్ కనిపించింది. మొత్తంగా 2.22 కేజీల కొకైన్ ఉంది. దాని విలువ రూ.13.35 కోట్ల వరకు ఉంటుంది. వారిని అరెస్ట్ చేసి , కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషిల్ కస్టడీ విధించింది. దీని వెనక ఎవరున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి ఇవ్వాలనుకున్నారు, అనే కోణంలో ఆరాతీస్తున్నారు.
వీడొక్కడే సినిమాల్లో అచ్చం ఇలాంటి సన్నివేశం ఉంటుంది. హీరో సూర్య ఫ్రెండ్ జగన్, మరికొందరు కూలీలు కడుపులో డ్రగ్స్ దాచుకొని మలేషియాకు తరలిస్తున్నారు. క్యాప్సుల్స్‌ను తేనెలో ముంచుకొని మింగేస్తారు. మలేషియా వెళ్లిన తర్వాత ఏనీమా ఇచ్చి సరుకును బయటకు తీస్తారు. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్ కడుపులో ఓ క్యాప్సుల్ పంక్చర్ అవుతుంది. అలా డ్రగ్స్ అతడి శరీరంలో కలిసిపోయి ప్రాణాలు కోల్పోతాడు. అలా డ్రగ్స్ తరలించినందుకు కూలీలకు రూ.50వేల నుంచి లక్ష వరకు ఇస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే జరగడంతో ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ పై మరింత నిఘా పెంచారు.