Begin typing your search above and press return to search.

ఇక్కడే కాదు.. చైనాలోనూ దున్నేస్తున్నాడే..

By:  Tupaki Desk   |   2 May 2019 11:09 AM GMT
ఇక్కడే కాదు.. చైనాలోనూ దున్నేస్తున్నాడే..
X
వీరమాచనేని డైట్.. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఈయన పద్దతులు పాటిస్తే ఇక రోగాలేవీ రావని ప్రచారం జరిగింది. ఇక్కడ ఆయన పద్ధతులు చాలా మంది పాటించి నిరూపించారు. కొందరు వ్యతిరేకించారు. అయితే దేశీయంగా ఈయన డైట్ కు గుర్తింపు వస్తుందో రాదో కానీ.. చైనా దేశంలో మాత్రం తాజాగా గుర్తింపు వచ్చింది.

తాజాగా ప్రముఖ చైనీస్ వైద్య అధ్యయన కేంద్రం ఒక చైనా వర్సిటీ ఒక బ్లాక్ కు ‘వీఆర్కే డైట్-ఇండియా’ను గుర్తిస్తూ ఆయన పేరును పెట్టింది. ఇది భారతీయ విధానానికి దక్కిన గౌరవంగా వీరమాచనేని అభివర్ణిస్తున్నారు.

చైనాలోని ప్రఖ్యాత చాంక్జింగ్ హైజియా క్యాన్సర్ హాస్పిటల్ తోపాటు ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరమాచనేని ‘అంకో న్యూట్రీషియనిస్ట్’ అవార్డ్ తో సన్మానించింది. ఆ సమయంలోనే ఓ బ్లాక్ కు ఆయన పేరును పెట్టారు.

చాంక్జింగ్ వైద్య పరిశోధన కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ డైట్స్ పై పరిశోధన చేస్తుంటుంది. అలా వీఆర్కే డైట్ పై కూడా పరిశోధన జరిగింది. హాంకాంగ్, జపాన్ లలో కూడా వీరమాచనేని డైట్ ను వివిధ అధ్యయన సంస్థలు గుర్తించాయి. ఇలా పరిశోధనల్లో ఫలితాలు రావడంతోనే ఆయనను సన్మానించి ఆయన పేరును విస్తృతంగా వాడేస్తున్నారు. చైనాలోనూ వీరమాచనేని గుర్తింపు పొందారు.