Begin typing your search above and press return to search.
ఏపీలో పొత్తు లేనే లేదని తేల్చేసిన మొయిలీ!
By: Tupaki Desk | 4 Sep 2018 3:36 PM GMTఆసక్తికర వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ. తాజాగా ఏపీలో పర్యటిస్తున్న ఆయన.. ఇటీవల కాలంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంటుందన్న మాట బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అలాంటిదేమీ లేదని చెప్పటంతో పాటు.. ఏపీలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేఉద్దేశం లేదని కుండ బద్ధలు కొట్టేశారు.
గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది. బాబు చేతకాని పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
అనవసర ఖర్చుతో పాటు.. అవినీతితో నిండా మునిగిన బాబు సర్కారు.. రానున్న ఎన్నికల్లో నిండా మునిగిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఇప్పటికే ఏపీలో చచ్చిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. మూడు.. నాలుగు శాతం ఓట్లు కలిసి వస్తాయన్న ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్నికలు ఏమైనా సొంతంగా పోటీ దమ్ము లేని చంద్రబాబు.. ఎన్నికల ప్రతిసారీ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవటం.. మిత్రుల అండతో అధికారాన్నిచేపట్టి.. అదంతా తన గొప్పతనంగా గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది.ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎవరితోనూ పోటీ పెట్టదని.. ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు మొయిలీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే మోడీ సర్కారుకు చిరాకు పుట్టిస్తున్న రాఫెల్ అంశం పైనా మొయిలీ మాట్లాడారు. రాఫెల్ ఒప్పందం ద్వారా కేంద్రం భారీ అవినీతికి అస్కారం కల్పించిందన్నారు.ఈ ఒప్పందంతో రిలయన్స్ కంపెనీకి మోడీ సర్కారు భారీ లబ్థిని చేకూర్చినట్లుగా చెబుతున్నారు.
ఎటువంటి అనుభవం లేని కంపెనీకి రాఫెల్ లాంటి పెద్ద ప్రాజెక్టును ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. రాఫెల్ స్కాం మీద విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసిన మొయిలీ.. ఈ విషయంపై మోడీ స్పందించకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. మొత్తానికి ఏపీలో పొత్తులన్నవి లేవంటూ బాబుకు కొత్త భయాన్ని మొయిలీ తెచ్చి పెట్టినట్లుగా కనిపిస్తోంది.