Begin typing your search above and press return to search.
బ్రతికుండగా తండ్రిని చూడలేదు , శవాన్ని మాత్రమే చూశా : వీరప్పన్ కూతురు !
By: Tupaki Desk | 21 July 2020 1:30 PM GMTగంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అంటే దేశంలో తెలియనివారంటూ ఉండరు. అయితే , స్మగ్లింగ్ కింగ్ గా పేరుగాంచిన వీరప్పన్ 2004లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే , ఇప్పుడు ఆ వీరప్పన్ కుమార్తెకి బీజేపీ కీలక పదవి కట్టబెట్టింది. వీరప్పన్ కుమార్తె విద్యారాణిని తమిళనాడు బీజేపీ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని, తాను చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. అలాగే తనజీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ ..తన తండ్రిని బ్రతికుండగా అసలు చూడలేదు అని , కేవలం మృతదేహం మాత్రమే కాసేపు చూశానని విద్యారాణి తెలిపింది. ఈ సమాజం తనను ఓ శత్రువుగానే, ప్రత్యర్ధిగానో చూడలేదన్నారు. మంచితనంతో ఆదరించిన వాళ్లు ఎందరో ఉన్నారని, ఇదే భాగ్యంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. తన తండ్రిని చూడనప్పటికీ.. ఆయన గురించి కొందరు మంచితనంతో ఎన్నో మాటలు చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. అలాగే జీవచ్చవంగా ఉన్న తన తండ్రిని ఏదో ఆందోళన, ఉరుకులు పరుగులుగా చూసినట్లు చెప్పారు. ఇక ఈ పదవి ఇచ్చిన బీజేపీ ఎదుగుదలకు కృషి చేస్తానని, దేశంలో జాతీయ పార్టీ అంటే ఒక్క బీజేపీ మాత్రమేనని అభిప్రాయపడ్డారు.కాగా వృత్తిరీత్య న్యాయవాది అయిన విద్య ఫిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేసారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్న బీజేపీ నేతలు విద్యకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవిని కట్టబెట్టారు. ...