Begin typing your search above and press return to search.

ద‌త్త‌న్న‌ను మ‌రీ ఇంత‌గా అవ‌మానిస్తారా?

By:  Tupaki Desk   |   10 July 2017 6:22 AM GMT
ద‌త్త‌న్న‌ను మ‌రీ ఇంత‌గా అవ‌మానిస్తారా?
X
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండారు ద‌త్తాత్రేయ‌కు తాజాగా దారుణ‌మైన అవ‌మానం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు స‌న్నిహితుడిగా.. ఢిల్లీలో తెలంగాణ ప్రాంతం నేత‌ల‌కు పెద్ద‌న్న‌గా చెప్పుకునే ద‌త్త‌న్న‌కు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మ‌రీ ఇంత అవ‌మానమా? అని విస్తుపోతున్నారు. బోనాల జాత‌ర‌లో భాగంగా మ‌హంకాళి అమ్మ‌వారి ఆల‌యానికి ఆదివారం ఉద‌యం ఏడున్న‌ర గంట‌ల ప్రాంతంలో కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి ద‌త్తాత్రేయ వ‌చ్చారు.

అయితే.. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నాన్ని మొయిన్ రోడ్డులోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేష‌న్ పాత బిల్డింగ్ ద‌గ్గ‌రే న‌లిపివేశారు. ర‌ద్దీగా ఉంద‌ని.. భ‌క్తులు ఎక్కువ‌గా ఉన్నార‌ని.. వాహ‌నాన్ని అనుమ‌తించ‌టం సాధ్యం కాద‌ని పోలీసులు ఆపేశారు. ద‌త్తాత్రేయ 9.20 గంట‌ల‌కు విమానంలో తిరుప‌తికి వెళ్లాల్సి ఉంద‌ని.. ద‌త్త‌న్న స‌తీమ‌ణి న‌డ‌వ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని.. వాహ‌నాన్ని అనుమ‌తించాల్సిందిగా ఆయ‌న అనుచ‌రులు కోరారు.

అయిన‌ప్ప‌టికీ పోలీసు అధికారులు నో చెప్పారు. వాహ‌నాన్ని అనుమ‌తించేందుకు కుద‌ర‌ద‌న్నారు. దీంతో చేసేదేమీ లేక‌.. వాహ‌నం దిగిన ద‌త్త‌న్న.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆల‌యం వ‌ద్ద‌కు న‌డిచి వెళ్లారు. తిరిగి వెళ్లే స‌మ‌యంలోనూ ఆయ‌న బ‌య‌ట కాసేపు వెయిట్ చేయాల్సి వ‌చ్చింది. కేంద్ర‌మంత్రి హోదాలో ఉన్న ద‌త్త‌న్న వెయిట్ చేస్తున్నా పోలీసులు పెద్ద‌గా రియాక్ట్ కాలేదు.

ఆ త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ అయిన క‌విత‌తో పాటు రాష్ట్ర మంత్రులు.. ప‌లువురు అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు.. జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్ద‌న్ రెడ్డితో స‌హా ప‌లువురు కింది స్థాయి నాయ‌కులు వామ‌నాలను ఆల‌యం వ‌ద్ద‌కు అనుమ‌తించ‌టం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర‌మంత్రి హోదాలో ఉన్న ద‌త్త‌న్న‌ను .. ఆయ‌న కుటుంబ స‌భ్యుల్ని న‌డిపించిన పోలీసులు.. మిగిలిన వారి విష‌యంలో మాత్రం మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే. ద‌త్త‌న్న వాహ‌నాన్ని ఆప‌టం అనుకోకుండా జ‌రిగింద‌ని పోలీసు ఉన్న‌తాధికారి ఒక‌రు చెప్ప‌టం క‌నిపించింది.