Begin typing your search above and press return to search.
ఇక, ఆ టీవీ చానళ్లు.. 200లకు పెంపు: బడ్జెట్లో నిర్మల వెల్లడి
By: Tupaki Desk | 1 Feb 2022 8:30 AM GMTవార్షిక బడ్జెట్‌లో అనేక కీలక ప్రతిపాదనలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రధాని ఈ-విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుంచి 200కు పెంచుతున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయు లకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు తీసుకువస్తామన్నారు. విద్యార్థులందరికి అందుబాటులోకి ఈ-కంటెంట్ ఉంటుందన్నారు. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం ఇస్తామన్నారు.
1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తాయని.. కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక తీసుకువస్తామన్నారు. నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు. పట్ట ణాలు, నగరాల్లో నిర్మాణరంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్టు తెలిపారు. పట్టణ ప్రణాళిక అభివృ ద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
విద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వివరించారు.. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం(ఎన్‌జీడీఆర్ఎస్) త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ తీసుకురా నున్నట్టు చెప్పారు.
దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ ను తీసుకువస్తామన్నారు. కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తామని చెప్పారు. బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం కల్పిస్తామని... దీంతో ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్ల కష్టాలు తీరుతాయని చెప్పారు. దేశీయ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు మంత్రి వివరించారు.