Begin typing your search above and press return to search.

బూతుల్లో టాప్ ప్లేస్‌కు పోటీ ప‌డుతోన్న వెల్లంప‌ల్లి..!

By:  Tupaki Desk   |   2 Oct 2021 3:30 AM GMT
బూతుల్లో టాప్ ప్లేస్‌కు పోటీ ప‌డుతోన్న వెల్లంప‌ల్లి..!
X
ఏపీ ప్ర‌భుత్వంలో బూతుల మంత్రి ఎవ‌రైనా ఉన్నారా ? అని ప్ర‌శ్నించుకుంటే వెంట‌నే ఎవ్వ‌రూ కూడా త‌డుముకోకుండా కొడాలి నాని పేరు చెపుతారు. ఆయ‌న బూతుల మంత్రిగా ప్ర‌సిద్ధి కెక్కారు. విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు కూడా అలాగే ఉన్నాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు అదే వైసీపీలో బూతుల మంత్రి 2 కూడా ఉన్నారా ? అన్న సందేహాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎవ‌రో కాదు అదే కృష్ణా జిల్లాకు చెందిన వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌. గ‌త కొంత కాలంగా త‌న ప‌ద‌వి నిలుపుకోవ‌డానికో లేదా జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేయ‌డానికో కాని.. వెల్లంప‌ల్లి కూడా వ‌రుస వివాదాల‌కు కేరాఫ్ అవుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును వెధ‌వ అని తిట్ట‌డం ద‌గ్గ‌ర నుంచి వెల్లంప‌ల్లి వివాదాల‌తో మీడియాలో ఉండేందుకే తాప‌త్ర‌య ప‌డుతున్న‌ట్టు అనిపిస్తోంది.

తాజాగా విజ‌య‌వాడ కార్పొరేష‌న్ స‌మావేశంలో టీడీపీ వాళ్లు వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయినా ఇంకా ఎందుకు ? ఇళ్లు కేటాయించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. దీనిని ప‌దే ప‌దే గుచ్చిన‌ట్టు ప్ర‌శ్నించ‌డంతో వెల్లంప‌ల్లి స‌హ‌నం కోల్పోయి బూతులు మాట్లాడారు. టీడీపీ కార్పొరేటర్లు టిడ్కో ఇళ్ల గురించి అధికార ప‌క్షాన్ని ప్ర‌ధానంగా టార్గెట్ చేశారు. ల‌బ్ధిదారుల్లో చాలా మందికి ఇళ్లు కేటాయించ‌లేద‌ని.. అయినా వారికి న‌గ‌దు ఎందుకు తిరిగి ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

టీడీపీ కార్పొరేట‌ర్లు దూకుడుగా ఉండ‌డంతో మంత్రి వెల్లంప‌ల్లి జోక్యం చేసుకున్నారు. టిడ్కో ఇళ్ల‌పై టీడీపీకి మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో ఇళ్ల ద‌ర‌ఖాస్తులు కూడా అమ్ముకున్నార‌ని ఆరోపించారు. వెంట‌నే టీడీపీ కార్పొరేట‌ర్లు వైసీపీ కార్పొరేట‌ర్లు కూడా అదే ప‌ని చేయలేదా ? మేయ‌ర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి మ‌రీ టిడ్కో ద‌ర‌ఖాస్తులు తీసుకువెళ్లి అమ్ముకున్నార‌ని మంత్రికి కౌంట‌ర్ ఇచ్చారు.

ఇరుప‌క్షాల వాదోప‌వాదాల‌తో గంద‌ర‌గోళం త‌లెత్తింది. అప్పుడు మంత్రి ఏం పీకారు అన‌డంతో స‌భ‌లో ఉన్న‌వాళ్లంతా మంత్రి తీరుపై ముక్కున వేలేసుకున్నారు. వెంట‌నే మంత్రికి సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు వ‌త్తాసు ప‌లికారు. ఆ వెంట‌నే మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి ప‌ది నిమిషాల పాటు స‌భ వాయిదా వేశారు. ఏదేమైనా వెల్లంప‌ల్లి రోజు రోజుకు హుందాత‌నాన్ని మ‌ర్చిపోయి దిగ‌జారి విమ‌ర్శ‌లు చేస్తోన్న‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.