Begin typing your search above and press return to search.

మాతో భోజనం చేయమని మంత్రి అడిగితే కేసీఆర్ ఆన్సర్ తెలుసా?

By:  Tupaki Desk   |   5 Aug 2022 5:45 AM GMT
మాతో భోజనం చేయమని మంత్రి అడిగితే కేసీఆర్ ఆన్సర్ తెలుసా?
X
దేశంలోని ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయన మాటలకు.. చేతలకు అస్సలు సంబంధం లేనట్లుగా కొన్ని వ్యవహారాలు ఉంటాయి. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. తన అతిధ్యంతో అదరగొట్టేసే ముఖ్యమంత్రుల్లో సీఎం కేసీఆర్ ఒకరుగా చెబుతుంటారు. ఆయనతో కలిసి లంచ్ చేయాలే కానీ.. దాన్ని మరెప్పటికీ మర్చిపోలేమంటారు. మిగిలిన వారి మాదిరి కాకుండా భోజనం చేయటం అన్నది కాస్త నింపాదిగా జరుగుతుందని చెబుతారు.

మంచి భోజన ప్రియుడిగా పేరున్న కేసీఆర్ చేతుల మీదుగా అతిధ్యం అంటే ఆ లెక్కనే వేరంటారు. చాలా తక్కువ సందర్భాల్లో తప్పించి.. బయట ప్రదేశాల్లో భోజనం చేయటానికి సీఎం కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపరు. ఒకవేళ.. భోజనం బయట చేయాల్సి వస్తే.. అదంతా పక్కా షెడ్యూల్ అన్నట్లుగా ఉండాలే కానీ.. అప్పటికప్పుడు అన్నట్లు అస్సలు ఉండకూడదు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చాలా ఎక్కువసేపు అందులో గడపటం తెలిసిందే.

మధ్యాహ్నం వచ్చిన ఆయన.. మూడు గంటలకు పైనే అక్కడే ఉండిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను నిశితంగా గమనిస్తూ.. అక్కడున్న విశేషాల్ని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో తనకున్న సందేహాల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం మొత్తమ్మీదా లక్షలాది సీసీ కెమేరాల్ని అనుసంధానం చేసే అద్భుత సాంకేతిక ప్రక్రియకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది కమాండ్ కంట్రోల్ సెంటర్.

ఈ సెంటర్ ను చూస్తున్న వేళ.. కేసీఆర్ కు వచ్చిన సందేహం ఏమిటో తెలుసా? ఓఆర్ఆర్ మీద వెళుతున్న వాహనాల్ని చూసే వీలుందా? అని అడగటం.. ఆ వెంటనే ఆయనకు చూపించారు. అంతేకాదు.. ఒకే స్క్రీన్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు.. యాదాద్రి టెంపుల్.. హైదరాబాద్. వరంగల్ ఇలా అన్ని ప్రాంతాల్ని అనుసంధానం చేసిన వైనాన్ని వివరిస్తూ.. అక్కడి రియల్ ద్రశ్యాల్ని చూపించారు.

అనుకున్నదాని కంటే ఎక్కువసేపు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. తమతో పాటు లంచ్ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాస్తంత చొరవ తీసుకొని కోరారు. అయితే.. అందుకు స్పందించిన కేసీఆర్.. ఫర్వాలేదు.. తాను వెళ్తానంటూ కళ్లతో అభ్యర్థించటం గమనార్హం.

అయితే.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి.. తమతో భోజనం చేయాలని కోరారు. దీంతో.. పోలీసు అధికారి మాటలకు నోచెప్పకుండా..వారితో కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి మంత్రి అభ్యర్థనను కళ్లతో నో చెప్పేసిన కేసీఆర్ అందుకు భిన్నంగా సీనియర్ పోలీసు అధికారి రిక్వెస్టుకు వెంటనే ఓకే చెప్పటం విశేషం