Begin typing your search above and press return to search.

క‌విత‌క్క చెబితేనే ఫైల్ మీద సంత‌క‌మ‌న్న మంత్రి!

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:31 AM GMT
క‌విత‌క్క చెబితేనే ఫైల్ మీద సంత‌క‌మ‌న్న మంత్రి!
X
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ హ‌వా న‌డుస్తోంది. ఈ మాట అన్నంత‌నే టీఆర్ఎస్ నేత‌ల‌కు మ‌హా కోపం వ‌చ్చేస్తుంది. ఎందుకు మా మీద అదే ప‌నిగా ఆడిపోసుకుంటారంటూ ఫైర్ అవుతుంటారు. కానీ.. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది మంచి విష‌య‌మే. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. నిజామాబాద్ ఎంపీ క‌వితల విష‌యంలో పార్టీ సీనియ‌ర్లు మొద‌లుకొని జూనియ‌ర్లు వ‌ర‌కూ ప్ర‌ద‌ర్శిస్తున్న విధేయ‌త ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతోంది.

తాజాగా పందిమంది మంత్రుల‌కు ప‌ద‌వులు అప్ప‌జెప్పిన కేసీఆర్ కార‌ణంగా గ‌డిచిన రెండు రోజులుగా సెక్ర‌టేరియ‌ట్ క‌ళ‌క‌ళ లాడుతోంది.ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన రెండు నెల‌ల త‌ర్వాత మంత్రి ప‌ద‌వులకేటాయింపు జ‌రిపిన నేప‌థ్యంలో కొత్త‌గా మంత్రిప‌ద‌వులు ద‌క్కించుకున్న వారు కేసీఆర్ అండ్ కోకు పూర్తి విధేయులుగా ఉండే అంశంపై ఒక‌రితో ఒక‌రు పోటీ ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన మంత్రులు ప‌లువురు కేసీఆర్ కుటుంబం ప‌ట్ల ఎంత‌లా విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారో చూస్తే నోట మాట రాదంతే. తాజాగా రోడ్లు.. భ‌వ‌నాలు.. గృహ నిర్మాణం.. శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖామంత్రిగా వేముల ప్ర‌శాంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. నిన్న (గురువారం) ఆయ‌న సెక్ర‌టేరియ‌ట్ లో త‌న ఛాంబ‌ర్లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ఎంపీ క‌విత కూడా హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిత్రా రామ‌చంద్ర‌న్ తొలి ఫైలును మంత్రి ఎదుట ఉంచారు. ఆ ఫైల్ నిజామాబాద్ హౌసింగ్‌ కు సంబందించిన ఫైల్ కావ‌టంతో.. అదే జిల్లాకు చెందిన మంత్రి వేముల న‌వ్వుతూ.. మా ఎంపీ క‌విత‌మ్మ సంత‌కం పెట్ట‌మంటే పెడ్తా నంటూ వ్యాఖ్యానించ‌టం అక్క‌డి వారికి సీన్ అర్థ‌మ‌య్యేలా చేసింది. దీంతో.. క‌విత క‌ల్పించుకొని.. చిరున‌వ్వుతో సంత‌కం పెట్టండి అన్నా.. ఏముందన్నారు. దీంతో.. మంత్రి ఫైలు మీద సంత‌కం చేశారు.

కేసీఆర్ కుటుంబం ప‌ట్ల త‌మ విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించేందుకు మంత్రులు ప‌డుతున్న పాట్లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ఇదే ఎపిసోడ్‌ లో మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన‌కు కేసీఆర్ మాటే శిరోధార్య‌మ‌ని.. త‌న ఊపిరి ఉన్నంత‌వ‌ర‌కూ కేసీఆర్ వెంటే ఉంటాన‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.