Begin typing your search above and press return to search.
జర్మనీలో వెంకయ్య అదిరిపోయే టూర్
By: Tupaki Desk | 1 Jun 2016 5:09 PM GMTకేంద్ర పట్టణాభివృద్ధి - పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తన జర్మనీ పర్యటనలో భాగంగా రోడ్లపై షికార్లు కొడుతున్నారు. అదేంటి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు జోరుగా సాగుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరి మనిషిగా పేరొందిన నాయుడుగారు ఈ రకంగా దూరంగా ఉండిపోయారేంటి అనుకోకండి. జర్మనీకి వెళ్లింది కూడా అధికారిక పర్యటనలో భాగంగానే. అక్కడ జరుగుతున్న మెట్రోపాలిటిన్ సొల్యూషన్స్-2016లో పాల్గొనేందుకు భాగంగా వెంకయ్య నాయుడు వెళ్లారు.
సమావేశంలో పాల్గొనడంతో పాటు పట్టణాభివృద్ధి మంత్రి కాబట్టి బాగా అభివృద్ధి చెందిన జర్మనీలో అక్కడి మౌళిక సదుపాయాలు, రోడ్లు ఇతరాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వెంకయ్యనాయుడు సిటీలో ఓ రౌండ్ వేశారు. అదికూడా కేంద్రమంత్రి హోదాలో అక్కడి ప్రభుత్వంతో మాట్లాడుకొని అధికారికంగా కాదు. ఎంచక్కా అక్కడి ఎలక్ట్రానిక్ రిక్షాలో నగరం చుట్టేశారు. అక్కడి పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. ఇక్కడి మౌళిక సదుపాయాలు ఇలా ఉన్నాయని వివరించారు. వెంకయ్యనాయుడు గారు చేసిన నగర పర్యటనతో ఇండియాలో కూడా ఇలాంటివే ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే అడుగులు వేస్తున్నారా అనే చర్చలు మొదలయ్యాయి.