Begin typing your search above and press return to search.

వీడియో: నగ్న శరీరాలపై కోళ్ల పందెం

By:  Tupaki Desk   |   9 Oct 2019 5:38 AM GMT
వీడియో:  నగ్న శరీరాలపై కోళ్ల పందెం
X
వెనుజులా దేశంలో ఓ జైలు అధికారులు ఖైదీల పట్ల చేసిన పని మానవత్వాన్ని మంటగలిపింది. సరిపడా తిండి, నీరు ఇవ్వాలని నిరసన చేపట్టిన ఖైదీలను నగ్నంగా చేసి వారి శరీరాలపై కోడి పందేలను నిర్వహించిన జైలు అధికారుల రాక్షసత్వం బయటకు వచ్చింది. ఓ రిపోర్టర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.

వెనుజులా దేశంలోని అనాకోలోని పోలీస్ కోఆర్డినేషన్ సెంటర్ లోని ఖైదీలు తమకు సరిపడా ఆహారం, నీరు ఇవ్వడం లేదంటూ, బంధువులు చూడడానికి వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకోవడానికి అనుమతించడం లేదని నిరసన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన జైలు అధికారులు వారిపై దమనకాండకు పాల్పడ్డారు.

దాదాపు 70 ఖైదీలను రెండు గంటలపాటు విచక్షణ రహితంగా కొట్టారు జైలు అధికారులు. అంతటితో ఊరుకోకుండా వారిని నగ్నంగా చేసి నేలపై పడుకోబెట్టి వారి శరీరాలపై కోళ్ల పందెలను నిర్వహించారు. ఆ కోళ్లు వారి శరీరాలను చీరుతుంటే చూస్తూ రాక్షసానందం పొందారు. వీరికి కొన్ని గంటల పాటు తిండి, నీరు ఇవ్వలేదు..

ఈ వీడియో ఎవరో తీస్తే బయటకు వచ్చింది. వెనుజులాకు చెందిన ఓ రిపోర్టర్ దీన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వెనుజులా జైలు అధికారుల దురాగతం బయటకు వచ్చింది. దీనిపై మానవహక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. దీంతో వెనుజులా ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.