Begin typing your search above and press return to search.
పోస్టు తీసుకోను.. పోస్టుమ్యాన్ ను కాను.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు
By: Tupaki Desk | 11 Aug 2022 4:28 AM GMTఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీ విరమణ పూర్తి అయ్యింది. అత్యున్నత పదవుల్లో ఒకటైన ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయనేం చేయనున్నారు? ఎలాంటి బాధ్యతల్ని చేపట్టనున్నారు? పార్టీలో మరోసారి కీలకం కానున్నారా? వీటన్నింటికి దూరంగా ఉంటారా? మొత్తంగా ఏం చేయనున్నారు? లాంటి ప్రశ్నలు చాలామందిలో ఉండటమేకాదు.. ఇవే అంశాలకు సంబంధించిన చర్చ చాలానే నడస్తోంది.
ఇలాంటి ప్రశ్నలకు సూటిగా.. స్పష్టంగా సమాధానం చెప్పేశారు వెంకయ్య. అంతేకాదు.. ఉప రాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తర్వాత తానేం చేయాలన్న ఆలోచనను ఆయన వెల్లడించారు. మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్ఠిలో ఒక మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ అనంతరం బీజేపీ సభ్యత్వాన్ని తీసుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చేశారు.
'పోస్టు ఏది ఇచ్చినా తీసుకోను. మళ్లీ పోస్టు మ్యాన్ కాదలుచుకోలేదు' అన్న మాట ఆసక్తికరంగా మారింది. తాను పదవీ విరమణ చేసిన తర్వాత పార్టీ పదవి ఇస్తానంటే స్వీకరించేందుకు తాను సిద్ధంగా లేనన్న మాటను ఆయన క్లియర్ గా చెప్పేసినట్లైంది. ఎందుకిలా అనే దానికి కారణం లేకపోలేదు.
వెంకయ్యనాయుడి మైండ్ సెట్ చూస్తే.. అవసరంగా మాట అనిపించుకోవటానికి ఆయన అస్సలు ఇష్టపడరు. ఉప రాష్ట్రపతిగా సేవలు అందించిన వ్యక్తి మళ్లీ రాజకీయ నేతగా మారి విమర్శలు చేస్తూ.. ప్రత్యర్థుల విమర్శలు ఎదుర్కొంటూ ఉండటం కంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి గౌరవంగా ఉండాలన్న ఆలోచనతో రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
మరి.. ఆయనేం చేయనున్నారు? అన్న ప్రశ్నకు కూడా వెంకయ్య సమాధానం ఇచ్చేశారు. ప్రజల్లో తిరగటం.. యువతకు సదా సందేశం ఇస్తూ ఉండటమే తన తర్వాతి కార్యాచరణగా పేర్కొన్నారు. రాజకీయం అంటే కేవలం పదవులే కాదు.. ప్రజలకు సేవ చేయటం కూడా అన్న వెంకయ్య మాటల్ని చూస్తే.. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు. చాలామంది ప్రముఖులు చేసే పని పుస్తకాలు రాయటం. తమకున్న అనుభవసారాన్ని.. తమకు తెలిసి నిజాల్ని ప్రజలకు చెప్పేందుకు వీలుగా పుస్తకాలు రాస్తారా? అంటే కూడా ఆయన నో చెప్పేశారు.
అలా ఎందుకో కూడా కారణం చెప్పేశారు. 'రాజకీయ పరిస్థితులపై అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటా. నా ముందుకు వచ్చే అంశాల్ని ప్రధాని మోడీ వద్దకు తీసుకెళతా. పుస్తకం రాస్తే వాస్తవాలు రాయాలి. బతికున్నవారి గురించి యథార్ధాలు రాస్తే అనర్ధాలు వస్తాయి' అని చెప్పటం ద్వారా వెంకయ్య నుంచి పుస్తకాలు ఆశించటం అనవసరమనే చెప్పాలి.