Begin typing your search above and press return to search.

చ‌తురోక్తి- నీ వెయిట్ త‌గ్గించి పార్టీ వెయిట్ పెంచ‌మ్మా?

By:  Tupaki Desk   |   29 March 2018 6:01 AM GMT
చ‌తురోక్తి- నీ వెయిట్ త‌గ్గించి పార్టీ వెయిట్ పెంచ‌మ్మా?
X
రాజ‌కీయాల్లో మాట‌కారి త‌నం ఉంటే... వివాదాస్పద సంద‌ర్భాల‌ను కూడా తేలిక‌గా మార్చ‌వ‌చ్చు. ఇలాంటి వాటిలో సిద్ధ‌హ‌స్తులు వెంక‌య్య‌నాయుడు - కేసీఆర్ లు. నిన్న‌టి రాజ్య‌స‌భ‌లో రిటైర్ అవుతున్న స‌భ్యుల‌కు చివ‌రిసారి మాట్లాడే అవ‌కాశం ఇచ్చారు. అపుడు ఎంపీ రేణుకా చౌద‌రి వంతు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య‌కు-ఎంపీ రేణుకా చౌద‌రికి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ జ‌రిగింది.

రేణుక చౌద‌రి మాట్లాడూతూ... మీరు ఎన్నో కిలోలకు ముందు నుంచి చూస్తున్నారు. అంటే నేను ఇప్ప‌టికంటే స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి అంటే చాలా కాలం నుంచి మీకు తెలుసు అనే విష‌యాన్ని కాస్త క‌వితాత్మ‌కంగా చెబుతూ మీరు అంద‌రికీ స‌మ్మ‌తంగా బాధ్య‌త‌లు నిర్వ‌హించాలి. చ‌ర్చ‌లలో స‌భ్యులంద‌రినీ స‌మానంగా చూస్తూ మాట్లాడే అవ‌కాశాలు క‌ల్పించాలి... అంటూ స‌ద్విమ‌ర్శ చేశారు. నా బ‌రువు గురించి చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మీ బ‌రువు బాధ్య‌త‌ల‌ను స‌మాన అవ‌కాశాలు అంద‌రికీ క‌ల్పించ‌డం ద్వారా స‌క్ర‌మంగా నెర‌వేర్చండి అంటూ ఆమె చ‌మ‌త్కారంగా చేసిన విమ‌ర్శ‌ల‌కు స‌భ్యుల మొహాల్లో చిరున‌వ్వులు విరిశాయి.

దీనికి అంతే ఛ‌లోక్తిగా స్పందించారు రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు. అలాగేన‌మ్మా... ఈ సంద‌ర్భంగా నేను నీకు ఒక చిన్న స‌ల‌హా ఇస్తున్నాను. త‌ప్ప‌కుండా పాటించు. *నీ బ‌రువు త‌గ్గించుకుని - నీ పార్టీ వెయిట్ పెంచ‌మ్మా* అంటూ వ్యాఖ్యానించ‌డంతో స‌భ మ‌రోసారి చిద్విలాసంతో మెరిసింది. పార్టీ విలువ పెరిగేలా స‌భ‌లో ప్ర‌వ‌ర్తించ‌మ‌న్నంది వెంక‌య్య అంత‌రార్థం. దీనికి అంతే స్పీడుగా రేణుక చౌద‌రి స్పందించారు. మా పార్టీకేమండి - బ్ర‌హ్మాండంగా ఉంది. ఇక స‌భ‌లో నుంచి వెళ్లిపోతున్నాను.. నా వెయిట్ గురించే ఆలోచించాలి అంటూ వ్యాఖ్యానించారు.