Begin typing your search above and press return to search.

ప‌ద్మావ‌తిపై నిర‌స‌నలు...వెంకయ్య‌ ఆందోళ‌న‌

By:  Tupaki Desk   |   25 Nov 2017 12:02 PM GMT
ప‌ద్మావ‌తిపై నిర‌స‌నలు...వెంకయ్య‌ ఆందోళ‌న‌
X
వివాదాస్పద సినిమా పద్మావతిని వ్యతిరేకిస్తూ నిర‌స‌న‌లు, బెదిరింపులు - ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న స‌మ‌యంలో బీజేపీ నేత‌లు ఇందుకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అనూహ్య‌మైన రీతిలో బీజేపీ ప్ర‌ముఖులు భావప్ర‌క‌ట‌న‌ స్వేచ్ఛకు అండ‌గా నిలిచారు. సినిమా ఆందోళ‌న‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ ఈ సినిమా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేశారు. పద్మావతి చిత్ర వివాదానికి సంబంధించి తగిన సమయంలో సరైన చర్యలు తీసుకోనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చునని అద్వానీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప‌ద్మావతి చిత్రం విషయంలో సరైన చర్యలు లేకపోతే రేపు మరొక చిత్రానికీ ఇదే పరిస్థితి పట్టవచ్చునని అద్వానీ అన్నారు. అందుకే స‌రైన రీతిలో నిర్ణ‌యం తీసుకోవాలన్నారు.

కాగా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ సినిమాపై సాగుతున్న ఆందోళ‌న‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. పద్మావతి చిత్రంపై వివాదం చెలరేగుతున్న సమయంలో ఆ చిత్రం పేరు ప్రస్తావించకుండా వెంకయ్యనాయుడు కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఒక సాహిత్య సదస్సులో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ కొన్ని చిత్రాలకు సంబంధించి ప్రజలు తమ సెంటిమెంట్లు దెబ్బ తిన్నాయంటూ ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. నిరసనలతో మొదలుపెట్టి రివార్డులు ప్రకటించే స్థాయి వరకూ పరిస్థితి చేరిందని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక బెదిరింపులకు తావు లేదని ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య అన్నారు. ఈ సందర్భంగా గతంలో నిషేధం ఎదుర్కొన్న సినిమాలు గరమ్ హవా - కిస్సా కుర్సీ - ఆంది సినిమాల గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని సినిమాలకు సంబంధించి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని, కొంతమంది ప్రజలు తన మనోభావాలను, మత ఆచారాలను దెబ్బతీసేలా సినిమాలు ఉంటున్నాయని ఆరోపిస్తున్నారన్నారు. సినిమాను వ్యతిరేకించేవాళ్ల ఆందోళనలు శ్రుతిమించిపోతున్నాయని కూడా వ్యాఖ్యానించారు.

శారీరకంగా హాని కలుగజేస్తే బహుమతులు ఇస్తామంటూ ప్రకటించడం ప్రజాస్వామంలో అంగీకరించే పరిస్థితి ఉత్పన్నం కాదని ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ఆందోళ‌న కారుల హెచ్చ‌రిక‌ల‌కు ప్ర‌స్తావిస్తూ వారి వద్ద అంత డబ్బు ఉందో లేదో తనకు తెలియదని, కాని ప్రతి ఒక్కరూ కోటి రూపాయిలు రివార్డు ప్రకటిస్తున్నారని ఆయన అన్నారు. కోటి రూపాయిలు పొందడం అంత తేలిక విషయమా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాగా, రాజస్థాన్‌లోని నహార్‌గఢ్‌కోట సరిహద్దు గోడకు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించచ‌డం ఆ చుట్టు పక్కల గోడలు, బండరాళ్లపై బొగ్గుతో రాసిన కొన్ని నినాదాలు కనిపించిన ఉదంతం శుక్ర‌వారం క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యక్తిది హ త్యా? ఆత్మహత్యా అన్న విషయం తేలాలని పోలీసు లు చెప్పారు. మృతుడిని శాస్త్రీనగర్ వాసి చేతన్‌కుమా ర్ సైనీ (40)గా గుర్తించామని, అతడు చేత్తివృత్తి పనివాడన్నారు. పద్మావతి సినిమాను వ్యతిరేకిస్తూ అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత భావించారు. కానీ అతని మృతదేహం వేలాడుతున్న ప్రదేశానికి సమీపంలో కొన్ని బండరాళ్లపై ఉన్న నినాదాలు మరో కో ణాన్ని చెబుతున్నాయని అధికారులు చెప్పారు. ఒక రాయిపై హమ్ పుత్లే నహీ జలాతే, లట్‌కాతే హై (మేము దిష్టిబొమ్మలను దహనం చేయం ఇలా వేలాడదీస్తాం) అని రాసి ఉంది. మరో చోట పద్మావతీకా విరోధ్ కర్నే వాలో, హం ఖిలే సే సిర్ఫ్ పుత్లే నహీ లట్‌కాతే (పద్మావతిని వ్యతిరేకించే వ్యక్తులారా, మేము కో టగోడలకు కేవలం బొమ్మలను వేలాడదీ యం) అని రాసి ఉంది. మరో రాయిపై చేతన్ తాంత్రిక్ అని, ఇంకో రాయిపై చేతన్ తాంత్రిక్ మారా గయా (చేతన్ తాంత్రిక్ చంపబడ్డాడు) అని రాసి ఉంది. మరో రా యిపై ఉన్న నినాదం ఓ వర్గం వారు మరో వర్గం వా రిని రెచ్చగొడుతున్నట్లు ఉంది. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.