Begin typing your search above and press return to search.
రూటు మార్చిన బీజేపీ కేంద్ర మంత్రులు..
By: Tupaki Desk | 31 Aug 2015 7:46 PM GMTసడన్ గా రూటు మారిపోయింది...ఎందుకో అర్థం కావడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిన్నటి వరకు ఎంత మొత్తుకున్నా కేంద్ర మంత్రి వెంకయ్యానాయుడు నోటి నుంచి మాత్రం ఇస్తాం అన్న ముక్క రాలేదు. నా వల్లే ఏపీకి ఈ మాత్రం న్యాయం అయినా జరుగుతుందని ఆయన బిల్డప్ ఇచ్చుకోవడం మినహా ఇక్కడ ప్రజల కు తీపి కబురు ఏనాడు చెప్పలేదు. ఇక నిర్మలా సీతారామన్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏదో చేస్తారని మనం ఆశించడం కూడా తప్పే.
అలాంటి బీజేపీ కేంద్ర మంత్రులు ఒక్కసారి గా ప్రత్యేక హోదా విషయంలో సడెన్ గా రూటు మార్చేశారు. మాటల్లో యూ టర్న్ తీసుకున్నారు. సరికొత్త పల్లవి అందుకున్నారు. ఆ పల్లవి మనకు కూడా కాస్త వినసొంపుగానే ఉంది. నిన్నటి వరకు అడ్డంకులున్నాయ్.. స్పెషల్ ప్యాకేజీ కోసం పోరాటం చేస్తామన్న నిర్మలా సీతారామన్, వెంకయ్య నేడు ప్రత్యేక హోదా వస్తుందని..అందుకు కసరత్తులు చేస్తున్నామని చెపుతున్నారు.
కేంద్రం వాణిజ్యపన్నుల శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ అయితే ప్రత్యేక హోదా విషయంలో నూటికి నూరుశాతం కట్టుబడి ఉన్నామని...ఇది తన మాట కాదని..ఎన్డీయే ప్రభుత్వం మాటేనని చెప్పారు. కొన్ని సాంకేతిక అంశాలు ఇందుకు అడ్డంకి గా ఉన్నందున వాటిని పరిష్కరించి ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేస్తామని ఆమె చెప్పారు. ఇక వెంకయ్య కూడా సాంకేతిక అంశాలను పక్కనపెట్టి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోందని..ఆ నివేదిక రాగానే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెపుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గేదే లేదని ఆయన అంటున్నారు.
నిన్నటి వరకు ఈ విషయం పై అస్సలు నోరు మెదపడానికే ఇష్టపడని వెంకయ్యనాయుడు లాంటి వాళ్లు కూడా సడెన్ గా రూటు ఎందుకు మార్చారా అన్న సందేహాలు వస్తున్నాయి. కేంద్రం నుంచి వీరికి ఈ విషయంలో ఏవైనా సంకేతాలు అందాయా..వీరు ప్రత్యేక హోదాపై యూ టర్న్ ఎందుకు తీసుకున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. వీరి మాటలు ఎలా ఉన్నా ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఏపీ ప్రజలకు వేయి కళ్లతో ఎదురు చూస్తూ కాలం గడిపేస్తున్నారు.